నెం1 కోడలు సీరియల్ అత్త సుధా చంద్రన్ నిజ జీవితం చూస్తే ఔరా అనాల్సిందే
ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని అందిస్తూ ప్రసారం అవుతున్న నెం 1కోడలు సీరియల్ లో ప్రముఖ క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్ నటిస్తున్నారు.తెలుగు బుల్లితెరపై తొలిసారి నటిస్తున్న ఈమె నాగిని సిరియల్ లో యామిని పాత్ర ద్వారా తెలుగువారికి సుపరిచితమైంది. వాగ్దేవి పాత్ర ద్వారా ఓ గొప్పింటి మహిళగా,జీవితంలో అన్నింటా నెంబర్ వన్ గానే ఉండాలన్న పొగరుబోతు అత్తగా కనిపించబోతోంది.
నెగెటివ్ షేడ్స్ గల పాత్రల్లో నటించి సుధా చంద్రన్ నిజ జీవితం మాత్రం ఎందరికో ఆదర్శంగా ఉంటుంది. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అందరి అభిమానాన్ని చూరగొన్న క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్ తన 16వ ఏటా కాలు పోగొట్టుకుంది. అయినా నిరాశ పడకుండా జైపూర్ వెళ్లి పెట్టుడు కాలు పెట్టించుకుని రెండేళ్లలోనే డాన్సర్ గా తానేమిటో నిరూపించుకున్నారు.
ఇక సుధా చంద్రన్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని,ఆమెను హీరోయిన్ గా పెట్టి సింగీతం శ్రీనివాసరావు అప్పట్లో తెలుగులో తీసిన మయూరి మూవీ సూపర్ హిట్ అయింది. రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై ఈ మూవీ నిర్మించారు. ఆమె నటనకు నేషనల్ అవార్డు వచ్చింది. ఆమె పేరు మారుమోగిపోయింది.వరుస ఛాన్స్ లు రావడంతో దాదాపు45హిందీ చిత్రాల్లో చేసింది. 1993నుంచి హిందీ ,తమిళ్ సీరియల్స్ లో నటిస్తున్నఈమె ఇప్పుడు తొలిసారి వాగ్దేవి పాత్రతో తొలిసారి తెలుగు బుల్లితెర ఆడియన్స్ ని అలరించబోతోంది.