Movies

సాయి ధరమ్ తేజ్ డిగ్రీలో లవ్ స్టోరీస్ సీక్రెట్స్ లీక్ చేసిన అలీ

ఈటీవీలో ప్రసారం అయ్యేటటువంటి “ఆలీతో సరదాగా” ప్రోగ్రాంకు ఇటీవలే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి వచ్చారు.అలా వచ్చి ఎన్నో విషయాలను పంచుకున్నారు.అలాగే వచ్చే వారం మాత్రం “ప్రతిరోజూ పండగే” హీరో సాయి ధరమ్ తేజ్ మరియు ఆ చిత్ర దర్శకుడు మారుతి ముఖ్య అతిధులుగా వచ్చారు.ఇప్పుడు దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోనే ఈటీవీ వారు విడుదల చెయ్యగా అందులో మారుతీ మరియు సాయి ధరమ్ తేజ్ చాలా విషయాలనే వెల్లడించారు.ఈ ఎపిసోడ్ లో సాయి తేజ్ తనవి కొన్ని పర్సనల్ విషయాలను కూడా చెప్పేలానే ఉన్నారు.

తన డిగ్రీలో ఏదో జరిగింది చెప్తావా అంటూ ఆలీ కూపీ లాగే ప్రయత్నం చెయ్యగా మారుతి నాకెందుకు చెప్పలేదు అలాంటివి అన్నీ అని అన్నారు.అలాగే ఓ రోజు రాత్రి బాగా లేట్ నైట్ అయ్యి ఇంటికి వచ్చే సమయంలో తన మావయ్య పవన్ కళ్యాణ్ కు బుక్కయ్యానని ఆ సమయంలో తనకి కళ్యాణ్ గారు ఫుల్ గా తిండి పెట్టారని కూడా అన్నారు.తన తల్లికి తాను లేట్ నైట్ వచ్చానని చెప్పకుండా కళ్యాణ్ గారే ఆరోజు కాపాడారని అన్నట్టుగా సాయి ధరమ్ తేజ్ తెలిపాడు.మరి ఈ ఎపిసోడ్ లో ఇంకెన్ని విశేషాలను హీరో మరియు దర్శకులు తెలిపారో తెలియాలంటే వచ్చే డిసెంబర్ 23 సోమవారం టెలికాస్ట్ కాబోయే ఈ ఎపిసోడ్ ను మిస్సవ్వకుండా చూడాల్సిందే.