కృష్ణ కాలర్ పట్టుకున్నందుకు ఆ స్టార్ హీరో కటౌట్స్ చింపేసి తగలబెట్టిన కృష్ణ ఫ్యాన్స్
సినిమాల్లో హీరోలు అంటే ఫాన్స్ కి వెర్రి అభిమానం. తమ హీరోలు హిట్స్ ఇస్తే,సంబరం చేస్తారు. ప్లాప్ అయితే డీలా పడతారు. ఫాన్స్ తీరు అలానే ఉండడమే కాదు, తమ హీరోని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేరు. గొడవలకు దిగుతారు. ఇంచుమించు అందరి హీరోల ఫాన్స్ ఇలా ఉండడం వల్లనే టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి హీరోస్ వెనుకంజ వేస్తారు. మల్టీస్టారర్ మూవీస్ చాలా తక్కువ వస్తుంటాయి. ఒక హీరో ని ఎక్కడ తక్కువ చేసి చూపిస్తే, సదరు హీరో ఫాన్స్ ఎక్కడ గొడవ చేస్తారోనని భయంగా ఉంటుంది.
ఈ విషయం సూపర్ స్టార్ కృష్ణ,కింగ్ నాగార్జున మూవీస్ తో రుజువైంది. 1993లో విడుదలైన వారసుడు మూవీపై చాలా అంచనాలు ఉండేవి. ఓపక్క సూపర్ స్టార్ కృష్ణ, మరోపక్క కింగ్ నాగార్జున హీరోలు కావడం దీనికి కారణం. ఇక సినిమా విడుదల రోజున ఇద్దరి ఫాన్స్ నానా రచ్చ చేశారు. అయితే ఈ మూవీలో కృష్ణ రోల్ తక్కువగా ఉందని, కృష్ణ కాలర్ ని నాగార్జున పట్టుకున్నాడని, అంతటితో ఆగకుండా రేయ్ అన్నాడని కృష్ణ ఫాన్స్ రెచ్చిపోయారు.
అప్పటికప్పుడు వారసుడు సినిమా ఆడే థియేటర్స్ లో సినిమా ఆపేసారు. ఫిలిం బాక్స్ లు లాగేసి పగులగొట్టారు. నాగార్జున కటౌట్స్ ,బ్యానర్స్ చించేశారు. దాంతో నాగ్ అభిమానులు రెచ్చిపోయారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పనిచెప్పారు. ఎపి అంతటా ఇదే పరిస్థితి తలెత్తడంతో చివరకు కృష్ణ,నాగార్జున జోక్యం చేసుకుని సర్దిచెప్పాల్సి వచ్చింది. సినిమాను సినిమాగా చూడాలని,క్యారెక్టర్ పరంగా అలాగే యాక్ట్ చేశామని,అయితే నిజ జీవితంలో చాలా అన్యోన్యంగా ఉంటామని పేపర్ స్టేట్ మెంట్స్ ఇచ్చారు. అయినా కృష్ణ ఫాన్స్ లో ఆవేశం చల్లారలేదు. దీంతో కృష్ణ కాలర్ పట్టుకున్న సీన్ ని,వాడు వీడు అని సంబోదించే సీన్ కట్ చేసారు. అప్పటికి గాని కృష్ణ ఫాన్స్ కోపం తగ్గలేదు.