ఊటీ లో టాలీవుడ్ హీరోల ఫార్మ్ హౌస్ లు ఎలా ఉంటాయో తెలిస్తే నమ్మలేరు
వేసవి వస్తే చాలు ఊటీలో షూటింగ్స్ కి వెళ్లేలా ప్లాన్ చేసుకోవడంలో మన హీరోలు ముందుండేవారు. అందుకే ఊటీ లొకేషన్స్ మన తెలుగు సినిమాల్లో ఎక్కువగా అప్పట్లో కనిపించేవి. ఎన్టీఆర్,అక్కినేని,కృష్ణ ఊటీలో షూటింగ్స్ అంటే చాలా ఫేమస్. కనీసం ఒక పాటైనా ఊటీలో తీయాలనే సెంటిమెంట్ నడిచేది. ఇక కృష్ణ అయితే తన సినిమాలకు ఎక్కువగా ఊటీనే ప్రిఫర్ చేసేవారట.
ఒకే ఏడాది కృష్ణ 20సినిమాల్లో నటిస్తే ,అవన్నీ కూడా కొంత కొంత భాగం ఊటీలోనే షూటింగ్ జరుపుకోవడం విశేషం. ఆసమయంలోనే అక్కడ ఓ మామిడి తోట తీసుకున్నారట. ఇటీవల సీనియర్ నటుడు నరేష్ ఊటీ మామిడి తోటలో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టాడు. ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ ఫోటోలు పలువుర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఎన్టీఆర్,అక్కినేని ఫామ్ హౌస్ లు కొనకపోయినా, ఎప్పుడైనా పిక్నిక్ లకు వెళ్ళడానికి ,రిలాక్స్ అవ్వడానికి వీలుగా గెస్ట్ హౌస్ లాంటి విల్లాలు కొన్నారట. ఎందుకంటే వీరిద్దరూ హైదరాబాద్ లో స్టూడియోలు కట్టి, వ్యవసాయ భూములు కొన్నారు కదా.
ఇక చిరంజీవి,రజనీకాంత్ లు అయితే బెంగుళూరులో 20ఎకరాల మామిడి తోటలు కొని,ఫామ్ హౌస్ లు నిర్మించారు. దగ్గరలోనే దట్టమైన అడవి కూడా ఉండడంతో క్రూర మృగాలు వస్తాయట. కానీ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ప్రతియేటా ఇక్కడ మెగా ఫామిలీ సంక్రాంతి సంబరాల్లో మునిగితేలతారట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హైదరాబాద్ లో మామిడి తోట,ఫామ్ హౌస్ ఉండగా, మహేష్ బాబుతో సహా పలువురు స్టార్స్ కి రింగ్ రోడ్డు అవుట్ కట్స్ లో తోటలు ఉన్నట్లు టాక్. కాగా మహానటి సావిత్రి ఊటీలో గెస్ట్ హౌస్,ఫామ్ హౌస్ నిర్మించారు. కోర్టు లావాదేవీల్లో ఇరుక్కుని అవి ఆమెకు చివరి దశలో ఉపయోగపడలేదు. అయితే జెమిని గణేశన్ ఎంటర్ అయ్యి,వాటిని కొడుకు పేరుమీదికి మార్చినట్లు టాక్.