Movies

కృష్ణం రాజు కూతుళ్లు ఎం చేస్తున్నారో తెలుసా?

విజయనగర సామ్రాజ్య వారసత్వానికి చెందిన క్షత్రియ వంశీయుడు రెబెల్ స్టార్ కృష్ణంరాజు విభిన్న పాత్రలతో సినిమా రంగంలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు. ఈయన సతీమణి శ్యామలాదేవి. వీరికి సాయి ప్రసీద,ప్రకీర్తి,ప్రదీప్తి అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొడుకులు లేకున్నా కూతుళ్లను బాగానే పెంచారు. ఎప్పుడైనా డౌన్ అయినా ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దని కూతుళ్ళకు చెబుతుంటానని కృష్ణంరాజు అంటున్నారు. ఏవేరేమన్నా నమ్మనని అయన చెప్పడం వలన, ఆ నమ్మకాన్ని నిలబెడుతూ కూతుళ్లు ముగ్గురూ చదువులో బెస్ట్ అనిపించుకున్నారని ఆయన అంటారు.

డొనేషన్స్ లేకుండా మెరిట్ పై సీట్లు తెచ్చుకున్నారని,సొంత కాళ్లపై నిలబడాలని మనస్తత్వం వారిదని కృష్ణంరాజు చెప్పారు. పెద్దకూతురు సాయి ప్రసీద మెరిట్ మీద లండన్ లో మెడిసిన్ సీటు సంపాదించుకుంది. లాస్ ఏంజిల్స్ లో ప్రస్తుతం ప్రొడక్షన్ కోర్సు చేస్తున్న ఈమె ప్రొడక్షన్ విభాగంలోకి రావాలని అనుకుంటోంది. రెండో కూతురు సాయి ప్రకీర్తి ఆర్కిటెక్చర్ చదువుతోంది. మంచి పర్శంటేజ్ రావడంతో జె ఎన్ టి యు లో సీటొచ్చింది. పెయింటింగ్ పై మంచి పట్టుకల్గి బొమ్మలు బాగా గీస్తుంది. ప్రతియేటా ప్రభాస్ బర్తడే కి అందమైన ప్రభాస్ బొమ్మను కూడా గీసి ఇస్తుందని కృష్ణంరాజు ఓ ఇంటర్యూలో చెప్పారు.

మూడో కూతురు సాయి ప్రదీప్తి సైకాలజీ కోర్సు చదువుతోంది. డొనేషన్ కట్టి చదివిస్తానని చెప్పినా వినకుండా మెరిట్ తో సీటు తెచ్చుకుంది. ‘నాకేమీ మేనేజ్ మెంట్ కోటాలో సీటు వద్దు,నా పర్శంటేజ్ చూడండి మెరిట్ లో సీటొచ్చింది. డొనేషన్ కడతానన్న 3లక్షలు నాకివ్వండని వాదించింది’ అని కృష్ణంరాజు గర్వంగా చెప్పుకొచ్చారు. గౌరవంగా బతకాలన్నదే తన ఉద్దేశ్యమని, పిల్లలు కూడా అదే దారిలో వెళ్తున్నారని ఆయన ఆనందంగా చెప్పారు.