అదిరింది యాంకర్ సమీర గురించి ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా?
గత ఎనిమిదేళ్లుగా ఈటీవీలో వస్తున్న జబర్దస్త్ కామెడీ షో విపరీతమైన పాపులార్టీ తో దూసుకెళుతోంది. ఇందులో జడ్జీలుగా నాగబాబు, రోజా ఉండేవారు. అయితే నాగబాబు అందులోంచి బయటకు రావడంతో జీతెలుగులో అదిరింది ప్రోగ్రాం కి జడ్జిగా వెళ్ళాడు. జబర్దస్త్ కి పోటీగా కామెడీ షో గా వస్తున్న అదిరింది షో ప్రతి ఆదివారం ప్రసారం అవుతోంది. పలు సీరియల్స్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సమీరా అదిరింది షో కి యాంకర్ గా వ్యవహరిస్తోంది.
ఆడపిల్ల,అభిషేకం,భార్యామణి,ప్రతిబింబం,మంగమ్మగారి మనవరాలు ,తదితర సీరియల్స్ లో నటించి మెప్పించిన సమీరా తమిళంలో కూడా పేరుతెచ్చుకుంది. 1991లో హైదరాబాద్ లో జన్మించిన సమీరా అక్కడే తన బాల్యం,విద్యాభ్యాసం గడిపింది. డిగ్రీ పూర్తిచేసి,డాన్సింగ్,నటనలో శిక్షణ పొందింది. స్కూల్ డేస్ నుంచి నటనపై మక్కువ ఉండడంతో సమీరను ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రోత్సహించారు. తండ్రి పూర్తిగా సహకరించి కుమార్తె ఎదుగుదలకు సాయం అందించాడు. పలు సీరియల్స్ లో కల్సి నటించిన అన్వర్ ని ప్రేమించి పెళ్లాడింది. ప్రముఖ నటి సన కుమారుడే అన్వర్.
పెళ్లయ్యాక కొన్ని సీరియల్స్ లో నటించిన సమీరా,తాజాగా జి తెలుగు అదిరింది కామెడీ షో కారణంగా సీరియల్స్ కి గ్యాప్ ఇచ్చింది. సుమ,శ్రీముఖి, రష్మీ,అనసూయ లకు పోటీగా సమీరా యాంకర్ గా అవతారం ఎత్తింది. హావభావాల విషయంలో సొంతంగా గుర్తింపు తెచ్చుకుంటుందో లేదో చూడాలి. అదిరింది షో స్టార్టింగ్ లో మొదలయ్యే సాంగ్ కి తన డాన్స్,గ్లామర్ తో మరింత వన్నె తెస్తోంది. గ్లామర్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవని తొలి షో ద్వారా చెప్పిందని టాక్. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. రెండో షో కిక్కిచ్చేలా యాంకరింగ్ చేసిందన్న మాట వినిపిస్తోంది.