Movies

అల వైకుంఠపురములో హైలెట్స్ అవేనట… ఫ్యాన్స్ కి పండగే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ముచ్చటగా మూడోసారి జతకడుతున్న బన్నీ ఈ సినిమాతో పాత రికార్డులు తిరగరాయడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్.
అయితే ఈ సినిమా కథ ఇదేనంటూ ఇప్పటికే పలు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాను ఈ కథ పోలి ఉంటుందనే వార్త తెగ వైరల్ అయ్యింది.

అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది.అయితే చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమాలోని సెకండ్ హాఫ్‌లో మూడు హైలైట్స్ ఉండనున్నట్లు, సినిమాకు అవే ప్లస్ పాయింట్స్ కానున్నాయని తెలుస్తోంది.ప్రీక్లైమాక్స్‌లో వచ్చే కామెడీ సీక్వెన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని తెలుస్తోంది.విలన్-హీరో మధ్య సాగే కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరించడం పక్కా అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా మూడు హైలైట్లతో అల వైకుంఠపురము సినిమా బన్నీ ఫ్యాన్స్‌కు అసలు సిసలు సంక్రాంతి పండగను అందించడం ఖాయమని తెలుస్తోంది.మరి ఆ హైలైట్లు ఏమిటో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.