అక్కడ హీరోయన్ల పరిస్థితి మరీ దారుణం అంటున్న ప్రముఖ నటి….
అప్పుడెప్పుడో తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ సినిమాలో ఓ గెస్ట్ రోల్‌లో కనిపించిన ముద్దుగుమ్మ బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా. తర్వాత తెలుగులో ‘విలన్’, ‘పరమ వీర చక్ర’ తదితర చిత్రాల్లోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కన్నా, బాలీవుడ్‌లోనే ఎక్కువ పాపులారిటీ ఉందనుకోండి ఈ పాపకి. అయితే, అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం సినిమాల కన్నా, పలు సెలబ్రిటీ షోల పైన ఎక్కువ ఫోకస్ పెడుతోంది ప్రస్తుతం. అందులో భాగంగానే తెలుగులో మన మంచు లక్ష్మీ ప్రసన్న నిర్వహిస్తున్న సెలబ్రిటీ బెడ్ టైమ్ స్టోరీస్ లాంటి ప్రోగ్రామ్‌నే నేహా ధూపియా కూడా నిర్వహిస్తోంది.
ఈ ప్రోగ్రామ్‌లో తనకు బాగా సన్నిహితులైన సెలబ్రిటీలను ఆహ్వానించి వారిని ఇంటర్వ్యూ చేస్తుంది. ఆసక్తికరమైన విషయాల్ని వెలికి తీస్తుంటుంది. ఆ సంగతి పక్కన పెడితే, అసలు మ్యాటర్‌లోకెళ్దాం. సౌత్‌లో హీరోయిల్ని తక్కువగా చూస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అది సరైన పద్ధతి కాదంటూ నీతులు చెప్పే ప్రయత్నం చేస్తోంది. నిజానికి ఈ భామ నటించిన టైమ్‌కీ, ఇప్పుడు సౌత్‌లో హీరోయిన్స్ పొజిషన్‌కీ చాలా తేడాలొచ్చేశాయి. హీరోలతో పాటు, హీరోయిన్లు కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా టెక్నికల్‌గా పలు విభాగాల్లో ముందుంటున్నారు. సో అప్పుడెప్పుడో జరిగిన ఇష్యూ గురించి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రస్థావించడం సబబుగా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.