Kitchen

కాకినాడ కాజా కు అరుదైన గుర్తింపు

కాజా పేరు వినని వారు ఉండరు.ఆ పేరు ఖండాంతరాలు దాటి మరీ వెళ్ళిపోయింది.అసలు కాకినాడకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది అంటే అది కాజా మహిమే.ఆ కాజాలను ఇంత రుచిగా, వెరైటీ గా తయారు చేసి ఇంత గుర్తింపు తీసుకొచ్చింది కోటయ్య అనే వ్యక్తి.

1890 ప్రాంతంలో కాకినాడలో కోటయ్య అనే వ్యక్తి కాజా మొదటగా తయారు చేశారు.గొట్టం కాజా ఎంతో రుచికరం గా ఉంటదన్న పేరొచ్చింది.అందుకే కాకినాడ కోటయ్య కాజా రుచి చూడాలని ప్రతి ఒక్కరు తహతహలాడుతుంటారు.అటువంటి కాకినాడ కోటయ్య కాజాకు అరుదైన గుర్తింపు ఇచ్చింది పోస్టల్ శాఖ.

కాకినాడ కోటయ్య కాజా పేరుతో పోస్టల్ స్టాంప్ ను కూడా విడుదల చేసింది.కాజా అంటే స్వీటు.అయితే ఆ కాజాలో గొట్టం కాజా, మడత కాజా, చిట్టి కాజా ఇలా అనేక రకాలు ఉన్నాయి.కాకినాడ లో తయారయ్యే కాకినాడ కాజా బాగా పాపులర్ అయ్యింది.