మహేష్,బన్నీల హిట్ మూవీస్ ఎన్ని ఉన్నాయో చూడండి
ఓపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు,మరోపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లకు తెలుగు రాష్ట్రాలతో పాటు, పక్క రాష్ట్రాల్లో ముఖ్యంగా ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఓవర్సీస్ లో వీరి సినిమాలకు డాలర్స్ వర్షం కురుస్తుంది. బన్నీకి కేరళలో అనూహ్యంగా మార్కెట్ ఉండగా, మహేష్ కి కన్నడంలో అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ఉంది. 1999లో రాజకుమారుడు మూవీతో సూపర్ స్టార్ కృష్ణ వారసునిగా మహేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా, గంగోత్రి మూవీతో 2003లో మెగా ఫ్యామిలీ నుంచి అల్లు వారి అబ్బాయ్ గా బన్నీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరూ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ద్వారానే టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.
మహేష్ బాబుకి సినీ కెరీర్ లో 20ఏళ్ళు పూర్తయ్యాయి. 25సినిమాలు చేసాడు. బన్నీ తన 17ఏళ్ల కెరీర్ లో 18సినిమాలు చేసాడు. మహేష్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తొలిమూవీ ఒక్కడు 2003లో గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చింది. అయితే 2006లో పోకిరి వరకూ బ్లాక్ బస్టర్ లేదు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 40కోట్లు వసూలు చేసి, తెలుగు సినీ చరిత్రను తిరగరాసింది. 2011లో శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన దూకుడు మూవీ బ్లాక్ బస్టర్ అయింది.100కోట్లు వసూలు చేసిన ఈ మూవీలో రెండు గెటప్స్ లో మహేష్ అదర గొట్టాడు. 2015లో కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన శ్రీమంతుడు మహేష్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. 2018లో కొరటాల డైరెక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను,గత ఏడాది వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన మహర్షి మూవీస్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
రాజకుమారుడు, మురారి,అతడు, బిజినెస్ మ్యాన్ ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. బన్నీ అయితే గంగోత్రి,బన్నీ, పరుగు,సన్నాఫ్ సత్యమూర్తి మూవీస్ మంచి విజయాన్ని నమోదుచేసుకున్నాయి. అయితే రెండో సినిమా ఆర్యతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో 2004లో వచ్చిన ఈ మూవీ తెలుగు సినీ చరిత్రలో ఓ మైలురాయి అయింది. 2007లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన దేశముదురు మూవీతో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో2012లో వచ్చిన జులాయి మూవీ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. 2014లో సురేంద్రరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన రేసుగుర్రం కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. 2016లో బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన సరైనోడు మూవీ బ్లాక్ బస్టర్ అయింది.