‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో ‘HE So Cute’ పాట పడిన సింగర్ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు
ఈ సంక్రాంతికి భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఎఫ్ 2సినిమా తీసి, బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. అనిల్ సుంకర,దిల్ రాజు కల్సి ఈ మూవీ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సాంగ్స్,టీజర్,ట్రైలర్ భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సుదీర్ఘ విరామం తరువాత లేడి అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీతో కీలక పాత్ర పోషిస్తోంది. రష్మిక మందన హీరోయిన్ గా చేస్తోంది. సంగీత,హరితేజ, బండ్ల గణేష్,ప్రకాష్ రాజ్, తదితరులు నటిస్తున్నారు.
ఈ సంక్రాంతి సందర్బంగా జనవరి 11న విడుదల కాబోతున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభం నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసి, లాంచ్ చేసారు. ఇక ఈ సినిమాలో హి సో క్యూట్ పాట పాడిన సింగర్ గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఎవరూ ఊహించిన సింగర్ పాడలేదని మాత్రం తెలుస్తోంది. పైగా ఫేమస్ సింగర్ కూడా కాదట. మరి ఎవరని అనుకుంటున్నారా .. కేవలం 8ఏళ్ళ వయస్సున్న అహానా అనే పాప పాడిందట.
పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు అహానా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. మూడేళ్ళ వయస్సులోనే సంగీతంలో శిక్షణ ప్రారంభించిన ఈ పాప తమిళనాడుకి చెందినది. అక్కడ విజయ తదితర తమిళ ఛానల్స్ లో లిటిల్ ఛాన్స్ ,సూపర్ సింగర్స్ జూనియర్ 6వంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొని విజేత అయింది. దాంతో ఎన్నో సినిమాల్లో పాటలు పాడే ఛాన్స్ వచ్చింది. ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరు మూవీలో పాడడం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. పెద్ద సింగర్స్ సైతం మెచ్చుకుంటున్న ఈ బుల్లి సింగర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతగా లక్షల్లో అభిమానులను సొంతం చేసుకుంది.