కమెడియన్ సునీల్ నిజమైన ఆస్తి ఎంతో తెలుసా ?
టాలీవుడ్ లో దాదాపు 200కి పైగా సినిమాల్లో కమెడియన్ గా నటించి తన హాస్యంతో నవ్వించాడు. భీమవరానికి చెందిన సునీల్ కమెడియన్ గానే కాదు హీరోగా కూడా హిట్స్ అందుకున్నాడు.1996లో తెలుగు సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి, అనూహ్యంగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న సునీల్ తనకంటూ ఓ ప్రత్యేకత సంతరించుకున్నాడు.
సునీల్ ఆస్తి ఎంత, ఏడాదికి ఎంత సంపాదిస్తాడు, ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడు వంటి విషయాలు పరిశీలిస్తే,దాదాపు 125కోట్ల ఆస్తి ఉందట. ఏడాదికి సినిమాల ద్వారా 6నుంచి 7కోట్లు వస్తాయట. ఇక ఒక్కొక్క సినిమాకు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందుకుంటాడట.
జూబ్లీ హిల్స్ లో మూడు కోట్లు విలువ చేసి భవంతి ఉంది. రెండు సూపర్ లగ్జరీ కార్లు మెయింటేన్ చేస్తున్నాడు. అయితే తన పట్టుదల తన ఆస్తి అని చెబుతాడు. కమెడియన్ గా చేస్తూ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో మర్యాద రామన్న మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత రెండు మూడు సినిమాలు పోయినా సరే,పట్టుదలగా మళ్ళీ కమెడియన్ అవతారం ఎత్తాడు.