Movies

టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు ?

ఇప్పుడున్న స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకుంటే టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరని అడిగితె చెప్పడం కొంచెం కష్టమైనా సరిగ్గా భేరీజు వేస్తె ఎవరో తేలడం ఖాయం. గతంలో నెంబర్ వన్ గా యోగా భామ అనుష్క శెట్టి ఉండేది. అయితే స్టార్ హీరోలతో అంటించకపోవడం వలన స్టార్ డమ్ వెనక్కి వెళ్ళింది. అయితే హయ్యస్ట్ రెమ్యునరేషన్ మాత్రం ఈమె తీసుకుంటోంది. ఈమె తర్వాత నెంబర్ వన్ గా సమంత ఉండేది. కానీ స్టార్ హీరోల సరసన ఈమె పేరు ప్రస్తావనకు రావడం లేదు.

అనుష్క బాటలోనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ ని సమంత ఎంచుకోవడం కూడా ఇందుకు కారణం. అయితే తమిళంలో అటు లేడీ ఓరియెంటెడ్,ఇటు స్టార్ హీరోల మూవీస్ తో నెంబర్ వన్ గా నయనతార కొనసాగుతోంది. రజనీకాంత్,విజయ్ సినిమాలకు నయనతారకు పోటీ లేదు. ఇక తమన్నా, కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోయిన్స్ జాబితాలో ఉన్నారు. అందరితో చేస్తున్నారు. భరత్ అనే నేను మూవీ తో ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఆతర్వాత వినయ విధేయ రామ చేసి బాలీవుడ్ కి చెక్కేసింది. అనుపమ,కీర్తి సురేష్ లాంటి వాళ్ళు ఏడాదికి ఒక్కటి కూడా చేయడం లేదు. సాయిపల్లవి అయితే కంటెంట్ సినిమాలు తప్ప కమర్షియల్ సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు.

అయితే పూజ హెగ్డే కూడా మంచి ఫామ్ లో ఉంది. కానీ ఈమెకు పెద్దగా సూపర్ హిట్స్ పడడంలేదు. అరవింద సమేత వీర రాఘవ మూవీలో నటించినప్పటికే హిట్ తాలూకు క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్ కి వెళ్ళింది. మహర్షి మాత్రం ఆమెకు హిట్ తెచ్చింది. ఇక సంక్రాంతికి విడుదలైన అలవైకుంఠపురంలో మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ తో జాన్ కూడా హిట్ కొడితే నెంబర్ వన్ రేసులోకి వచ్చేసినట్టే. మరో హీరోయిన్ రష్మిక మందన్న పరిస్థితి చూస్తే గీత గోవిందం హిట్ కొట్టి,కామ్రేడ్ తో ప్లాప్ తెచ్చుకుంది. ఇలా ఒక హిట్ ఒక ప్లాప్ అన్నట్టుగా ఉంది. అయితే మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు నిలబడ్డాన్ని బట్టి ఈమె ఏ రేంజ్ కి వెళుతుందో చూడాలి. మొత్తానికి నెంబర్ వన్ రేసులో టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరూ ప్రస్తుతానికి లేరన్న మాట వినిపిస్తోంది.