Movies

కళ్యాణ్ రామ్ తన అన్నతో కలిసి హోటల్ మేనేజర్ ని బెదిరించాడు…ఎందుకో తెలుసా?

ఆహ్వానం హోటల్ మేనేజర్ పైన హీరో కళ్యాణ్ రామ్ జులుం, అవునండి బాబు నిజం నమ్మకం లేదా అయితే ఈ స్టోరీ చదవండి. నందమూరి హరికృష్ణ గారికి హైదరాబాద్, అబిడ్స్ లో ఆహ్వానం అనే ఒక హోటల్ ఉండేది. కళ్యాణ్ రామ్ స్కూల్ డేస్ లో చాల అగ్రెస్సివ్ గ ఉండే వారు. కళ్యాణ్ రామ్, వారి అన్నయ్య తమ వద్ద ఉన్న పాత సైకిల్ ఎక్స్చేంజి గ ఇచ్చి, బి.స్.ఏ. స్పోర్ట్స్ సైకిల్ తీసుకోవటానికి 500 రూపాయలు తగ్గాయి, దాని కోసం కళ్యాణ్ రామ్ హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్లి 500 ఇస్తావా లేక పోతే టెలిఫోన్ ఎక్స్చేంజి సిస్టం ను పగలగొట్టమంటావా అంటూ బెదిరించి 500 తీసుకొని సైకిల్ కొన్నారట.

విషయం హరికృష్ణ గారికి తెలిసి ఇంటికి వెళ్లారు, ఎదురుగ కనిపించిన సైకిల్ ను ఒక్క తన్ను తన్ని, కళ్యాణ్ రామ్ గూబ గుయ్యిమనిపించారట, జరగబోయే ఉపద్రవాన్ని పసిగట్టిన కళ్యాణ్ రామ్ అన్న గారు బాత్రూం ను ఆశ్రయించి తప్పించుకున్నారు. పాపం మన వాడికేమో బుగ్గ బూరె అయ్యాక జ్ఞానోదయం అయ్యింది తాను చేసింది తప్పు అని.అంతా అయ్యాక ఆలా చెయ్యకూడదు నాన్న నీకేదయినా కావాలంటే నన్ను అడుగు అని బుజ్జగించారట హరికృష్ణ గారు. ఆయనకు చిన్న పిల్లలంటే ప్రాణం.,