Movies

తారల తెర చాటు ప్రేమలు…సక్సెస్ ఎన్ని… ఫెల్యూర్ ఎన్ని…???

సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్ చాలా సర్వ సాధారణం. ఇందులో కొన్ని రూమర్స్ ఉంటాయి. మరికొన్ని బహిరంగం అవుతాయి. అయితే కొన్ని పెళ్లి దాకా వెళ్తే, మరికొన్ని మధ్యలోనే బ్రేక్ అప్ అవుతాయి. సమంత ,సిద్ధార్ధ్ ల వ్యవహారం చూస్తే, జబర్దస్త్ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లిదాకా వ్యవహారం వెళ్లినా ఎందుకో బ్రేక్ అప్ అయ్యారు. ఈ విషయం మీడియా ముందు ఇద్దరూ ఓపెన్ అయ్యారు. ఆతర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత పెళ్ళిచేసుకుని హ్యాపీగా ఉంది. రానా, త్రిష మధ్య కూడా లవ్ ఎఫైర్ నడిచిందని అంటారు. డేటింగ్ సమయంలో పర్సనల్ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. కానీ ఇద్దరూ దూరం అయ్యారు.

రిచా గంగోపాధ్యాయ,సింగర్ రామ్ ల మధ్య ప్రేమాయణం నడిచింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని,పెళ్లికోసం సూసైడ్ బెదిరింపు కూడా రామ్ చేసాడని టాక్. అయితే ఎందుకనో ఆమె పెళ్ళికి నిరాకరించి,ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రష్యాకు చెందిన అన్నాలెజినోవాతో ప్రేమాయణం సాగించాడు. అయితే అప్పటికే రేణు దేశాయ్ తో పెళ్లయి,ఇద్దరు పిల్లకు జన్మనిచ్చాడు. ఆతర్వాత రేణుకి విడాకులిచ్చి అన్నాను పెళ్లాడాడు. గోవా బ్యూటీ ఇలియానా , ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ అండ్రూ తో డేటింగ్ చేసింది. వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నట్లు టాక్. అయితే ఇలియానా ఇప్పటికీ ఈ విషయంపై నోరుమెదపలేదు.

తమిళ నటుడు శింబు, హన్సిక నడుమ చాలాకాలం ఎఫైర్ నడిచింది. తర్వాత విడిపోయారు. వరుణ్ సందేశ్ ,శ్రద్ధా దాస్ తరచూ పార్టీలకు వెళ్లేవారు. కానీ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని ఇద్దరూ చెప్పుకొచ్చేవారు. లండన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్ తో కమల్ హాసన్ కూతురు లవ్ లో పడినట్లు,డేటింగ్ కూడా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. పైగా శృతికి సంబంధించిన అన్ని ఈవెంట్స్ లో మైఖేల్ దర్శనం ఉంటుంది. ఇంట్లో వారికి కూడా తెలిసినా ఆమె మాత్రం ఎప్పుడూ ఎక్కడా లవ్ ఎఫైర్ గురించి ప్రస్తావించలేదు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ , హీరో పార్వతి మెల్టన్ ల మధ్య ప్రేమ నడిచింది. జల్సా సమయంలో ఆమెకు డైమండ్ నక్లెస్ కూడా బహుమతిగా ఇచ్చాడట. అయితే వీరి మధ్య ఎలాంటి బంధం లేదని అంటున్నారు.