ధోని ఆస్థి ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాలసిందే
క్రికెట్ రంగంలో మహేంద్ర సింగ్ ధోని తెలియని క్రికెట్ అభిమాను లెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. భారతదేశానికి రెండు సార్లు ప్రపంచ కప్ అందించిన ఘనత ధోని సొంతం. ఒక సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధోని క్రికెట్ మీద పాషన్ తో ఈ రంగంలోకి వచ్చి, ఇండియాలోనే పాపులర్ అయ్యి వాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచాడు. కూల్ కెప్టెన్సీ తో భారత్ స్థాయిని అనూహ్యంగా పెంచాడు. ఎలాంటి మ్యాచ్ అయినా సరే, కూల్ నెస్ కోల్పోకుండా ఉండడం అతడి నైజం.
ప్రస్తుతం ఎందరో క్రీడాకారులకు ధోనిని స్ఫూర్తిగా చూపిస్తారు. మెరుపు వేగంతో స్టంప్ అవుట్స్ చేయగల ధీరుడుగా గుర్తింపు పొందిన ధోనికి ఎందరో అభిమానులున్నారు. స్వయం కృషితో ఎదగడమే కాదు,పదిమందికి సాయం చేసే గుణమే అతని నిజమైన ఆస్తిగా చెబుతారు. ధోని మేమేరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు అన్నం పెడుతున్నాడు. వారికి చదువు కూడా చెప్పేస్తున్నాడు.
అయితే ధోని ఆస్థి ఎంత, ఏడాదికి క్రికెట్ నుంచి, యాడ్స్ నుంచి ఎంత సంపాదన చేస్తాడు,ఒక్కో మ్యాచ్ కి ఎంత దక్కించుకుంటాడు వంటి వివరాల్లోకి వెళ్తే,ఇతడి మొత్తం ఆస్థి 750కోట్లు. ఒక్క ఏడాదికి క్రికెట్ ,యాడ్స్ పరంగా 48కోట్లు సంపాదిస్తాడు. ఇందులో క్రికెట్ పరంగా 15కోట్లు,యాడ్స్ పరంగా 25కోట్ల పైనే ఉంటుంది. సొంత ఊరిలో 10 కోట్ల విలువ చేసి ఇల్లు,రెండు సూపర్ లగ్జరీ కార్లు ఉన్నాయి.16సూపర్ లగ్జరీ బైక్స్ మెయింటేన్ చేస్తున్నాడు.