తండ్రులు ఇండస్ట్రీని శాసించిన దర్శకులు… కొడుకులు స్టార్ హీరోలు
సినీ ఇండస్ట్రీలో వారసత్వం బాగానే ఉంటుంది. అన్ని విభాగాల్లో వాళ్ళు వారసత్వం తీసుకొస్తున్నారు. ఇందులో డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అయితే డైరెక్టర్స్ పిల్లలు మాత్రం డైరెక్టర్స్ గా కాకుండా హీరోలుగా మారుతున్నారు. ఇలా వచ్చినవాళ్లలో కొందరు హిట్స్ కొడితే,మరికొందరు హీరోగా నిలదొక్కుకోడానికిక్ పడరానిపాట్లు పడుతున్నారు. ఒకప్పుడు టి కృష్ణ సినిమాలు అంటే అన్నీ హిట్ మీద హిట్ అందుకున్నాయి. అయితే ఆయన తనయుడు గోపీచంద్ మొదట విలన్ గా ఆతర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పలు సినిమాలు చేసిన గోపీచంద్ ఒక సందర్భంలో వరుస హిట్స్ తో స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు కాస్త వెనక బడ్డాడు.
మహిళా డైరెక్టర్ విజయ నిర్మల కొడుకు నరేష్ హీరోగా ఎన్నో సినిమాల్లో చేసి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి ‘నీతో’ అనే మూవీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత మరో సినిమా చేసాడు. అయితే రెండు సినిమాలు చతికిలబడ్డాయి. దాంతో టాలీవుడ్ నుంచి దూరంగా జరిగాడు. కొన్నాళ్ల తర్వాత అనుష్కను హీరోయిన్ గా పెట్టి జీరో సైజ్ మూవీ తీసి డైరెక్టర్ అయ్యాడు. అయినా మార్పు రాలేదు. మరో సీనియర్ డైరెక్టర్ దాసరి నారాయణరావు కొడుకు అరుణకుమార్ నటుడిగా ఎంట్రీ ఇచ్చి చతికిలబడ్డాడు. అయితే ఏ కోందండ రామిరెడ్డి తనయుడు వైభవ్ కోలీవుడ్ లో హీరోగా గుర్తింపుపొందాడు. అయితే తెలుగు మూవీస్ లో చేసినా లాభంలేకపోయింది
డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కొడుకులు ఆర్యన్ రాజేష్,అల్లరి నరేష్ లు ఇద్దరూ హీరోలుగా వచ్చారు. అయితే అల్లరి నరేష్ మూవీస్ హిట్ కొట్టగా, ఆర్యన్ రాజేష్ కి హిట్ దక్కక దూరంగా జరిగాడు. రవిరాజా పినిశెట్టి ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు సత్య డైరెక్టర్ గా, రెండో కొడుకు ఆది నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ దర్శక నిర్మాత ఎం ఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా మారి సినిమాల్లో చేస్తున్నాడు. పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి, ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వర్షం వంటి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ శోభన్ కొడుకు సంతోష్ శోభన్ హీరోగా నిలదొక్కుకోడానికి తంటాలు పడుతున్నాడు.