చైతూ కూడా పెంచేశాడుగా.. షాక్ అవుతున్న నిర్మాతలు
అక్కినేని నాగచైతన్య హీరోగా జోష్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించిన కొన్నాళ్లకే ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.ఏం మాయ చేశావే చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో తక్కువ కాలంలోనే మంచి కథలను ఎంచుకుంటూ తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ఇటీవల తన రియల్ లైఫ్ మామ వెంకటేష్‌తో కలిసి వెంకీ మామ చిత్రంలో నటించిన అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.
కాగా తాజాగా చైతూ ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ‘లవ్‌స్టోరీ’ అనే రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నాడు.అయితే చైతూ ప్రస్తుతం తన రెమ్యునరేషన్‌ను బాగా పెంచినట్లు తెలుస్తోంది.గతంలో 5-6 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్న చైతూ, ఇప్పుడు ఏకంగా 2 కోట్లు అదనంగా పెంచినట్లు తెలుస్తోంది.
చైతూ తన నెక్ట్స్ మూవీని పరశురాం డైరెక్షన్‌లో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం 14 రీల్స్ ప్లస్ వారు చైతూకు అడ్వాన్స్ కూడా అందించినట్లు తెలుస్తోంది.మరి చైతూ రెమ్యునరేషన్ నిర్మాతలకు ఎంతమేర కలిసొస్తుందా అనే అంశం మాత్రం వేచి చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.ఏదేమైనా చైతూ రెమ్యునరేషన్ అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.