సౌందర్య మృతి వెనక ఉన్న షాకింగ్ విషయాన్నీ బయట పెట్టిన పరుచూరి
టాలీవుడ్ లోకి ప్రవేశించిన కొన్ని రోజులకే సౌందర్య స్టార్ హీరోయిన్ గా ఎదగడమే కాకుండా అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె నటనతో ప్రేక్షకులను మెప్పించారు. గొప్ప నటిగా మారుతుంది అనే అందరూ ఊహిస్తున్న క్రమంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. సౌందర్య గొప్పతనం గురించి పరుచూరి గోపాల కృష్ణ తన పరుచూరి పలుకులు వీడియో కార్యక్రమంలో చెబుతూ…. ఈ కార్యక్రమాన్ని చాల రోజులుగా చేస్తున్నాను.
కానీ, నాకు అత్యంత ఇష్టమైన స్వర్గీయ సౌందర్య గురించి చెప్పలేదు అనే బాధ కలిగింది. తాజాగా వెంకీ మామ గురించి మాట్లాడుతున్న సౌందర్య పేరు పలకాల్సి రావడంతో ఆమె గురించి ఆలోచన నాలో కలిగింది. తాజాగా కొన్ని సినిమాలు చూస్తే ఆమె ఉంటె బాగుండేదేమో అనిపించింది. ఆమె 100కు పైగా సినిమాలు చేస్తే మేము ఎనిమిది సినిమాలకు మాత్రమే మేము మాటలు రాసాం. ఆమెను చూసినప్పుడల్లా ఇలాంటి భార్య ఉంటె బాగుండు అనే కంటే ఇలాంటి సోదరి ఉంటె బాగుంటుంది అనే ఫీలింగ్ అందరికి కలిగేది.
సావిత్రిని చూసినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలగడం అరుదు. ఓ హీరోయిన్ ని చూసి చెల్లెలు అనే ఫీలింగ్ రావడం విశేషమే. సౌందర్య మరణం ఊహించలేనిది. వాస్తవానికి ఆమె విమానంలో రావాల్సింది. కానీ ఆప్తమిత్ర (నాగవల్లి తెలుగులో) షూటింగ్ కారణంగా విమానం మిస్ అయింది. అందుచేత హెలికాప్టర్‌లో బయలు దేరారు. ఒకవేళ విమానంలో వచ్చి ఉంటే ఓ అద్భుత నటి మన నుంచి దూరం అయ్యేది కాదు. ఆమె లేని లోటు నిజంగా పూడ్చలేనిది అంటూ పరుచూరి అన్నారు.