Allu Arjun స్టైలింగ్ వెనక ఎవరు ఉన్నారో తెలుసా …?
Tollywood Hero Allu Arjun:గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చి, విభిన్న సినిమాలతో స్టైలిష్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అల్లు arjun ప్రోఫెషనల్ గా ఎంత స్టైలిష్ గా ఉంటాడో,రెగ్యులర్ లైఫ్ లోనూ అంతే స్టైలిష్ మెయింటేన్ చేస్తాడు.
తెరపై బన్ని కాస్ట్యూమ్ సెలక్షన్ కి ఫిదా అవ్వని వారు ఉండరు. కేవలం దుస్తుల ఎంపిక ఒక్కటే కాదు, బాడీ లాంగ్వేజ్ లోనూ బన్నిలో స్టైల్ మిళితం అయి వుంటుంది.క్యాజువల్ వేర్…డిజైనర్ వేర్ ఏది ధరించినా ప్రత్యేకంగా తన స్టైల్ ని ఎలివేట్ అయ్యేలా చూసుకుంటాడు. అందుకే స్టైలిష్ స్టార్ అయ్యాడు.
మరి ఆ స్టైలింగ్ వెనక గాడ్ ఎవరంటే అందరూ దిమ్మతిరిగే నిజాలు తెలిసాయి. అల్లు అర్జున్ పర్సనల్ స్టైలిస్ట్ హార్మన్ కౌర్ బన్నీ కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ను ఓ ఇంటర్వ్యూ లో రివీల్ చేయడంతో బయట పడ్డాయి. బన్నీకి బ్లాక్ కలర్ అంటే బాగా ఇష్టం. ఆ రంగు డిజైన్స్ ని ధరించడానికి ఎక్కుడగా ఇష్టపడతాడు.
అందుకే ప్రతి ఎంపికలోనూ బ్లాక్ కలర్ కామన్ గా ఉంటుంది. ఆ కలర్ బన్నీకి ఓ సెంటిమెంట్ గా మారిపోయింది. సినిమా ఓపెనింగ్ లకు హాజరవ్వాలన్నా, ఇతర ఈవెంట్లకు వెళ్లినా, వేదిక ఏదైనా సరే, తన స్టైల్ ని బ్లాక్ లో ఎలివేట్ అవ్వాల్సిందే. బ్లాక్ కలర్ తన దృష్టిలో ఒక బ్రాండ్. స్టైలింగ్ లో బన్నీ క్లారిటీ ఇదే. అంతేకాదు, తనకు ఏ సమయంలో ఏది అవసరమో, ఏది అనవసరమో కూడా బన్నీ చాలా క్లారిటీగా తెలుసుకుంటాడు.
బ్లాక్ డ్రెస్ ఏది ఇచ్చినా ఎంతో ఇష్టపడతారని హార్మన్ కౌర్ వెల్లడించారు. అయితే ఈ విషయంలో బన్నీకి స్ఫూర్తి మావయ్య మెగాస్టార్ చిరంజీవి అని తెలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు, చిరుకి తెలుపు రంగు అంటే ఇష్టం. ఎదుటివారు బ్లాక్ ధరించడం ఇష్టం. అందుకే బన్ని బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటాడు.