పెళ్ళై ఏడాది లోపు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన టాలీవుడ్ హీరోయిన్స్
సినీ రంగంలో ప్రేమలు పెళ్లిళ్లు,డేటింగ్స్ సర్వ సాధారణం అయింది. ఇక విడిపోవడం కూడా అంతేవేగంగా ఉంటున్నాయి. ఇక కొందరైతే ఏడాది కూడా తిరక్కుండానే విడాకులు తీసేసుకుంటున్నారు. నటి రాధిక 1985లో నటుడు,దర్శకుడు ప్రతాప్ పోతన్ ని పెళ్లిచేసుకుంది. కానీ ఏడాది లోపే చాలా గొడవలు అవ్వడంతో విడిపోయారు. ఇప్పటికీ ప్రతాప్ పోతన్ పేరు వినిపిస్తే ఒంటికాలిపై లేస్తుంది. మంచు వారబ్బాయి మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కొన్నాళ్లకే వీరిద్దరి మధ్యా తేడాలొచ్చేశాయి. సడన్ గా ఇల్లు వదిలేసి ఆమె అమెరికా వెళ్లిపోయినట్లు వార్తలొచ్చాయి. ఇక విడాకులు తీసుకున్నట్లు మనోజ్ అధికారికంగా ప్రకటించాడు.
నేపాలీ సుందరి మనిషా కొయిరాలా అన్ని భాషల్లో తన సత్తా చాటి,2010లో ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన నేపాలీ వ్యాపారవేత్తను పెళ్లిచేసుకుంది. నాలుగు నెలలకే విభేదాలతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. గతంలో హీరోయిన్ గౌతమి బిజీగా ఉన్నప్పుడే వ్యాపారవేత్త సందీప్ భాటీయ ను పెళ్లాడింది. 1999లో పాప కూడా పుట్టింది. ఆతర్వాత విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న గౌతమి 2005లో కమల్ హాసన్ తో సహజీవనం స్టార్ట్ చేసింది. అయితే పదేళ్ల తర్వాత బ్రేక్ అప్ చెప్పేసింది. నటి అమలాపాల్ కెరీర్ ఆరంభం నుంచి డైరెక్టర్ విజయ్ తో ప్రేమలో పడడమే కాదు పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఏడాదికే విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది.
హీరో సుమంత్,కీర్తిరెడ్డిని 7ఏళ్ళు ప్రేమించి 2004లో పెళ్లిచేసుకున్నాడు. ఏడాదికే వీరి బంధం తెగిపోయింది. గత ఏడాది పెళ్లి చేసుకున్న శ్వేతా బసు ప్రసాద్ మరో మూడు రోజుల్లో మొదటి వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉండగా, భర్త రోహిత్ ప్రసాద్ తో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇక తెలుగు తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుకన్య 2002లో అమెరికాలో సెటిల్ అయిన శ్రీధరన్ రాజగోపాల్ అనే వ్యక్తిని పెళ్ళాడి,సినిమాలు వదిలేసి, యుఎస్ వెళ్ళిపోయింది. కానీ ఏడాదిలోపే విడాకులు తీసుకుని ఇండియా వచ్చేసి,సినిమాలో ఛాన్స్ లకోసం తిరిగింది.