Movies

సమంత ఎన్ని సార్లు బాలీవుడ్ హీరోయిన్స్ ని కాఫీ కొట్టిందో చూడండి

ఒకర్ని అనుసరించడం,అనుకరించడం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. దీన్నే కాపీకొట్టడం అంటారు. ఇక సినిమా వాళ్ళైతే కథ,ట్రైలర్,మేకప్,డ్రెస్ ఇలా రకరకాల కాపీయింగ్ కి పాల్పడుతుంటారు. టాలీవుడ్ లోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ డమ్ తో దూసుకెళ్తున్న సమంత అన్నీ కాపీ బుద్దులేనట. అవును కరీనా కపూర్ చీరమీద బబు అని ప్రింట్ చేయించుకుంటే,ఇప్పుడు సమంత తన చీరమీద జాను అని ప్రింట్ చేయించుకుంది.

ఇక సమంత కట్టుకున్న ఈ చీర అక్కినేని ఫాన్స్ లో వైరల్ అయింది. ఈ చీరలో చూసాక ఎవరూ కళ్ళు తిప్పుకోలేకపోయారట. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఊర్వశి సేఠ్ రూపొందించిన బ్రాండ్ డిజైన్ ఇది. బాలీవుడ్ లో అనుష్క శర్మను రెగ్యులర్ గా అనుసరించే సమంత అప్పుడప్పుడు కరీనాను ఫాలో అవుతుంది. అయితే సమంత కాపీకొట్టడం ఇదే మొదటిసారి కాదు.

ఎందుకంటే,2012డిసెంబర్ లో స్పోర్ట్స్ ఈవెంట్ కి సోనమ్ కపూర్ వైట్ సారీ విత్ బ్లాక్ బోర్డర్ లో మెరవగా, నెల తిరక్కుండానే జనవరి 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో అదే డిజైన్ శారీలో కనిపించి అందరి కంట్లో పడింది. అలాగే దీపికా తలపై కిరీటం లాంటిది ధరించగా,సమంత కూడా అలానే ధరించింది. జులై 2013లో ఒక ఈవెంట్ కి దీపికా లెమన్ అండ్ ఎల్లో విత్ పింక్ డిజైన్ కి మెరిస్తే,2014లో హైదరాబాద్ లో జరిగిన ఓ ఫంక్షన్ లో సమంత సరిగ్గా అదే డిజైన్ లో మెరిసింది. అంతేకాదు చిత్రాంగ లో ధరించిన రెడ్ క్రాప్ శారీని సమంత అచ్చుగుద్దినట్లు ధరించింది.