అలీ చెంప చెళ్లు మనిపించిన డైరెక్టర్…ఎందుకో తెలుసా?
అలీ గారు ఎంత మంచి హాస్య నటుడో మీకు ప్రత్యేకంగా చెప్ప వలసిన అవసరం లేదు, బయట కూడా అయన ఎంత తుంటరివాడో మీకు తెలుసు, అయన ఎక్కడ ఉంటె అక్కడ నవ్వులు పూయిస్తుంటారు.అయన బాల నటుడిగా ఉన్నప్పుడు ఒక తుంటరి పని చేసారు, చిత్ర నిర్మాత ను చెంప దెబ్బ కొట్టి వంద రూపాయలు ఇస్తారా అని అడిగారట. 1980 లో నిప్పులాంటి నిజం అనే చిత్రం లో బాల నటుడిగా నటిస్తున్నారు, హీరో మురళీమోహన్ గారు.చెన్నై లో షూటింగ్ కు ఒక రోజు లేట్ గా వచ్చిన అలీ గారిని ప్రొడ్యూసర్ ముఖర్జీ గారు, ఎందుకు ఆలస్యం అయింది అని అడిగారట, అందుకు అలీ గారు నత్తి నత్తి గా సమాధానం చెప్పేలోపు, ముఖర్జీ గారు అలీ చెంప ఛెళ్ళు మనిపించి, వేళ్ళు వెళ్లి పనిచేసుకో అని పంపి వేశారు.
ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన అలీ గారు ఈవెనింగ్ వర్క్ తరువాత వెళ్లిపోతుంటే, పిలిచి, ఉదయం చెంప దెబ్బ కొట్టినందుకు సానుభూతి గా ఒక 100 రూపాయలు ఇచ్చారట.ఆ 100 రూపాయలు తీసుకున్న అలీ అక్కడ నుంచి వెళ్లిపోకుండా సర్, ఇంకో చెంప దెబ్బ కొట్టి ఇంకొక వంద రూపాయలు ఇవ్వండి అని ముఖర్జీ గారిని అడిగారట, సెట్ లో ఉన్న వాళ్లంతా పగలపడి నవ్వుకున్నారట, అదీ, చిన్న నాటి నుంచి అలీ గారికి అబ్బిన సెన్స్ అఫ్ హ్యూమర్, అందుకే అయన మూడు తరాల నటులతో కలసి ఇంకా నటిస్తూనే ఉన్నారు, ఇకముందు కూడా నటిస్తూనే ఉంటారు, అనటానికి ఎటువంటి సందేహం లేదు.