చిరుకి నితిన్ అత్తింటివారితో అనుబంధం…ఎలా…ఎప్పుడో …తెలుసా?
షాలిని రెడ్డి కందుకూరి తెలంగాణలోని నాగర్ కర్నూల్ అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు డాక్టర్లు. డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ షేక్ నూర్జహాన్ నాగర్ కర్నూలులో గత 20 ఏళ్లుగా ప్రగతి నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఇప్పుడు తమ రెండో కుమార్తె షాలినికి కూడా ప్రేమ వివాహమే చేస్తున్నారు.
డాక్టర్ నూర్జహాన్‌కు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. అది రాజకీయపరంగా. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు నూర్జహాన్ పార్టీలో చేరారు. అంతేకాదు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం సీటును నూర్జహాన్‌కు ఇచ్చారు చిరంజీవి. కానీ, ఆ ఎన్నికల్లో నూర్జహాన్ ఓడిపోయారు. ఆ తరవాత ప్రజారాజ్యం పార్టీ ఏమైందో అందరికీ తెలిసిందే. నూర్జహాన్ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ ఇప్పుడు నితిన్, షాలిని పెళ్లితో ఆమె వార్తల్లోకి వచ్చారు.