ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునలతో నటించిన ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడు అమ్మమ్మలు ..ఎవరో చూడండి!!
ఇండస్ట్రీలో ఎంతోమంది వస్తుంటారు వెళ్తుంటారు. కానీ కొందరు చైల్డ్ ఆర్టిస్ట్ ల నుంచి హీరోయిన్స్ దాకా ఎదిగి,పెళ్లి తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి,అమ్మ,అత్తా, వదిన తదితర పాత్రలతో దూసుకెళ్లారు. కొందరు అయితే అసలు ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. ఇలా రకరకాలుగా ఉండే హీరోయిన్స్ ఒకప్పుడు అగ్రహీరోల సరసన చేసి,ఇప్పుడు అమ్మమ్మలు,బామ్మలు అయ్యారు. ముందుగా అలనాటి అందాల నటి జయప్రద గురించి ప్రస్తావిస్తే,తెలుగులోనే కాదు బాలీవుడ్ ని కూడా ఓ ఊపు ఊపేసిన ఈమె కు ఓ కొడుకు ఉన్నాడు. అతడి పేరు సిద్ధార్ధ్ వర్మ. కొడుకు పెళ్ళికి టాలీవుడ్ ఇండస్ట్రీ తరలివెళ్లింది. ఇతడికి ఓ కొడుకు పుట్టడంతో జయప్రద నాయనమ్మ హోదా తెచ్చుకుంది.
రాధికా శరత్ కుమార్ ని ప్రస్తావిస్తే,తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. చిరంజీవితో కల్సి ఎన్నో సినిమాల్లో చేసిన రాధికా హీరోయిన్ గానే కాకుండా టివి సీరియల్స్ లో కూడా తన సత్తా చాటింది. సొంతంగా సీరియల్స్ తీసి క్లిక్ అయింది. ఈమెకు ఒక కొడుకు,ఒక కూతురు ఉన్నారు. ఈమధ్య కూతురికి ఓ కొడుకు పుట్టాడు. దీంతో రాధికా అమ్మమ్మ అయింది. అలాగే చిరు తో కల్సి సంఘర్షణ మూవీలో చేసిన నళిని తమిళంలో ఎన్నో హిట్ మూవీస్ లో చేసింది. తమిళ తెలుగు సీరియల్స్ లో నటిస్తూ దూసుకెళ్తోంది.
నళినికి ఒక కొడుకు,ఒక కూతురు ఉన్నారు. వీళ్లిద్దరు కవలపిల్లలు. ఇక పెళ్లిళ్లు కూడా అయిపోవడంతో వారికి పుట్టిన పిల్లల కారణంగా అమ్మమ్మ ,నాయనమ్మ అయిపోయింది . ఇక మంత్రి గారి వియ్యంకుడు మూవీలో చిరంజీవి తో కల్సి నటించిన పూర్ణిమా భాగ్యరాజ్ ఆతర్వాత తమిళంలో స్టార్ డమ్ తెచ్చుకుంది. ప్రేమించి పెళ్లాడిన ఈమెకు ఓ కొడుకు,ఓ కూతురు ఉన్నారు. వాళ్లకి కూడా పెళ్లిళ్లు అవ్వడంతో వారికి పుట్టిన బిడ్డల కారణంగా అమ్మమ్మ నాయనమ్మ అనిపించుకుంది.