Movies

సమంత వాడుతున్న లగ్జరీ కార్లు ఎన్నో తెలుసా?

ఏం మాయ చేసావే మూవీ కి తగ్గట్టు ఇద్దరి మధ్యా ఏం మాయ జరిగిందో కానీ అక్కినేని నాగచైతన్య,సమంత ల నడుమ ప్రేమ చిగురించి పెళ్ళికి దారితీసింది. ఆటో నగర్ సూర్య,మనం వంటి చిత్రాల్లో పెళ్ళికి ముందు ఇద్దరూ కల్సి నటించారు. ఆటోనగర్ సూర్య సమయంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టింది. పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో మరింత వేగం పెంచింది. ఆమె క్రేజ్ మరింత పెరిగింది. చైతు కూడా పర్వాలేదని అనిపిస్తున్నాడు. అయితే వీరిద్దరూ ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకున్నారట.

చైతూకి అత్యంత ఖరీదైన కారుని గతంలో బహుమతిగా ఇచ్చిందట. అంతేకాదు ఎన్నో బైక్స్ ,కారులు ఇచ్చిందట. ఎందుకంటే చైతూకి బైక్స్ ,కార్లు అంటే చాలా ఇష్టం. 2017జనవరి 29న జరిగిన నిశ్చితార్ధం చేసుకున్న వీళ్ళు 2017అక్టోబర్ 17న పెళ్లి చేసుకున్నారు. నిశ్చితార్ధం తరువాత ఎఫ్4బైక్ ని కొనిచ్చింది. దాని షోరూం ధర 27లక్షలు. తాజాగా కోటిన్నర పెట్టి డిఎమ్ డబ్ల్యు కారు సెవెన్ సీరీస్ కొనిచ్చిందట.

పెట్రోలు,డీజిల్ రెండు అప్షన్స్ తో ఈ కారు నడుస్తుంది. టాక్స్,రిజిస్ట్రేషన్ తో కలిపి కోటిన్నర దాటిపోతుంది. దీని నెంబర్ కోసం నాలుగున్నర లక్షలు ఖర్చుచేసాడట. ఇలాంటి కారు నాగార్జున 57వ పుట్టినరోజు సందర్బంగా కొన్నాడట. దీంతో అక్కినేని ఫ్యామిలీ దగ్గర ఇలాంటి రెండు కారులు ఉన్నాయి. చైతు కి ఇచ్చిన కారుకి టీఎస్ 09 ఏ ఎక్స్ టి ఆర్ 1290నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసారు. చైతు,సమంత ఇప్పటికే మరో మూడు లగ్జరీ కార్స్ వాడుతున్నారు. వీటి ఖరీదు 62లక్షలు,70లక్షలు,ఒక కోటి15లక్షలు విలువ కల్గిన కార్లవి. ఉమ్మడి ఫామిలీ గా ఉండే అక్కినేని కుటుంబంలో ఎన్నో కార్లు ఉన్నాయి.