ఎన్టీఆర్ కి తండ్రిగా చిరు నటిస్తారా? ఇక అభిమానులకు పండగే… !
అరవింద సమేత వీర రాఘవ రెడ్డి చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మరొక సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే త్రివిక్రమ్ మరొకసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు చేసే త్రివిక్రమ్ కథలో తండ్రి పాత్ర తప్పనిసరి. అయితే ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో ఒక ప్రముఖ హీరోని పెట్టె అవకాశాలు వున్నాయి. అయితే అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు తండ్రి పాత్రలో మెప్పించిన సంగతి అందరికి తెలిసిందే. మెగా, నందమూరి అభిమానులకు వీరి పాత్రలు చాల ఆకట్టుకున్నాయి.
త్రివిక్రమ్ సినిమా అంటేనే ల్యాండ్ మార్క్ మూవీ గా నిలుస్తుంది. అయితే ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో చిరు ని తీసుకొనే అవకాశం ఉందంటూ ఫిలిం నగర్ లో గాసిప్స్ మొదలయ్యాయి. ఇప్పటివరకు ప్రయోగాత్మక పాత్రలు చేసిన చిరు ఎన్టీఆర్ కి తండ్రి పాత్ర చేస్తారా? అంటే ఆలోచించాల్సిన విషయమే. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత నటించే చిత్రం కావడం తో పాన్ ఇండియా తరహాలో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి త్రివిక్రమ్ ఈ తండ్రి పాత్ర విషయం లో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.