నాగార్జు చేతిలో మోసపోయిన హీరోయిన్…ఆ హీరోయిన్ ఎవరు?
ఆనందం సినిమాతో పరిచయమై ఆకాష్ సరసన నటించి అదరగొట్టిన రేఖ కొన్ని సినిమాలు చేసి మంచి నటిగా పేరు తెచ్చుకున్నా, టాలీవుడ్లో ఉన్న పోటీకి ఆమె నిలదొక్కుకోలేక పోయింది. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీకి షిఫ్టయిన ఈ భామ, ముంబైలో ఉంట్లూ అక్కడా అవకాశాలకోసం ప్రయత్నిస్తోంది.
తను తెలుగునాట నిలదొక్కులేక పోవటానికి కారణం హీరో నాగార్జునే అని ఆయన తనను మోసం చేసాడంటూ ఓ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది.ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, నిన్న నేడు రేపు లాంటి చాలా సినిమాలు చేసింది రేఖ నాగార్జున సూపర్ డూపర్ హిట్ సినిమా మన్మథుడు లో రేఖకు ఓ అతిథి పాత్ర చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్రం చేస్తున్న సమయంలోనే నాగార్జున మనం మరో సినిమా చేద్దాం! అంటూ మాటిచ్చినట్లు ఈమధ్య ఓ ప్రముఖ ఛానల్లో అలీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరై చెప్పింది.