శేఖర్ కమ్ముల రియల్ లైఫ్ ఇదే …అన్ని వదులుకొని ఇక్కడకు వచ్చాడా…?
ఆడియన్స్ నాడిని తెల్సిన డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల ఇండస్ట్రీలో నిజంగా మంచి కాఫీలాంటి మూవీస్ అందించాడు. 1972 ఫిబ్రవరి 4న హైదరాబాద్ లో పుట్టిన శేఖర్ కమ్ముల అక్కడే స్టడీస్ చేసి,అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా చదువుకున్నాడు. అమెరికాలో అనుభవాలు జోడించి డాలర్ డ్రీమ్స్ మూవీ తీసాడు. ఇక్కడ పదివేల జీతం వస్తే, సమస్యలు ఉండవు. కానీ అమెరికాలో పదివేల డాలర్స్ వస్తే,డాలర్ కి ఒక సమస్య ఉంటుంది.
అందరినీ వదిలి ఉండడం,మనం కన్న కలలు కల్లలై పోవడమో కన్నీరై పోవడమో జరుగుతుంది. దీన్ని కళ్ళకు కట్టినట్లు ఈ మూవీలో శేఖర్ కమ్ముల చూపించాడు. ఇందిరాగాంధీ నేషనల్ అవార్డు,గోల్డెన్ లోటస్ అనే అవార్డు కూడా వచ్చింది. ఇక కమర్షియల్ సినిమాలకు ధీటుగా ఆనంద్ మూవీ ఆడింది. చాలా గొప్పగా శేఖర్ కమ్ముల తీసాడు. అలాగే గోదావరి మూవీ అలనాటి అందాల రాముడిని మరిపించేలా అందంగా తీసాడు. పాటలు సూపర్. సుమంత్ ,కమిలిని ముఖర్జీ నటన,సింగర్ సునీత డబ్బింగ్ అన్నీ అదిరిపోయాయి.
ఇక హ్యాపీ డేస్ మూవీ అందంగా తీసాడు. ఇక పొలిటికల్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా లీడర్ ని తీసి హిట్ కొట్టాడు. లీడర్ అంటే ఇలా ఉండాలని,పొలిటికల్ సినిమా ఇలా కూడా తీయొచ్చా అనేలా ఈ సినిమా ఉంది. నెగెటివ్ షెడ్ లో ఉండే రానాను మంచి హీరోగా చూపించాడు. ఇక ఫిదా అనే మూవీ తెలంగాణా యాసలో తీసి హిట్ కొట్టాడు. వరుణ్ తేజ్,సాయిపల్లవి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. పాటలు బాగా తీసాడు. అందుకే శేఖర్ కమ్ముల సినిమాలు ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తాయి. కొత్తవాళ్లను తీసుకొచ్చి తాను అనుకున్నవిధంగా చిత్రాన్ని తీయడంలో శేఖర్ కమ్ముల అందెవేసిన చేయి.