పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన పడవ…దాని ప్రత్యేకతలు తెలిస్తే షాక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనానిగా ఓ పక్క రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోపక్క సినిమాల్లో కూడా రీ ఎంట్రీ ఇచ్చి,బిజీ అయిపోయాడు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్ననేపధ్యంలో హిందీలో బిగ్ బి అమితాబ్ నటించిన పింక్ రీమేక్ మూవీలో పవన్ నటిస్తున్నాడు. ఈ మూవీకి లాయర్ సాబ్,వకీల్ సాబ్ అనే పేర్లు పరిశీలిస్తున్నారు.
ఇది కాకుండా మరో రెండు మూవీస్ కూడా ఒకే చేసాడు. ఇందులో క్రిష్ మూవీతో పాటు హరీష్ శంకర్ మూవీ కూడా ఉంది. క్రిష్ డైరెక్షన్ లో పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. సాయన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కే ఈమూవీని పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా తరహాలో తొలిసారి తెరకెక్కించనున్నాడు. భూమిక హీరోయిన్ గా తీసుకుంటున్నారట. సాధ్యమైన త్వరగా ఈ మూవీ పూర్తి చేయాలనీ చూస్తున్నారు.
ఇందుకోసం పడవ సెట్ ని హైదరాబాద్ లో ఆర్ట్ డైరెక్టర్ రెడీ చేస్తున్నాడు. సినిమాలో చాలా భాగం ఇందులోనే షూట్ చేస్తారట. ఖుషీ తర్వాత పవన్,భూమిక జోడీగా వస్తున్న ఈ సినిమా లో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉంటారట. ఇటీవల బాలయ్య నటించిన రూలర్ మూవీలో చేసిన భూమిక పవన్ మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించడానికి ఒకే చెప్పిందట.