Movies

మహేష్-వంశీల చిత్రం ఆగిపోవటానికి కారణం ఇదే

“భరత్ అనే నేను”, “మహర్షి” అలాగే రీసెంట్ గా “సరిలేరు నీకెవ్వరు” చిత్రాలతో వరుసగా ఒకదాన్ని మించిన బ్లాక్ బస్టర్ కొట్టి మహేష్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నారు.అయితే ఈ మూడు చిత్రాలను వెంటవెంటనే మొదలు పెట్టిన మహేష్ మూడో హిట్ తర్వాత కాస్త గ్యాప్ ఎక్కువే తీసుకున్నారు.కానీ తన మలి చిత్రానికి అయితే దర్శకుణ్ణి ముందు గానే ఫిక్స్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

మహేష్ కెరీర్ లో ఎంతో కీలకకమైన 25 వ చిత్రాన్ని ఎంతో మంచి చిత్రంగా తీర్చి దిద్దిన వంశీ పైడిపల్లితో సినిమా అనగానే దాని కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు.కానీ లేటెస్ట్ ఈ చిత్రం ఆగిపోయిందని వార్తలు ఊపందుకున్నాయి.అయితే ఈ సినిమా ఆగడానికి గట్టి కారణమే ఉన్నట్టు తెలుస్తుంది.మహేష్ ఇప్పటికే వంశీకు ఎక్కువ సమయం ఇచ్చారని కానీ వంశీ స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ వెర్షన్ ను మహేష్ దగ్గరకు ఇంకా చేరవెయ్యకపోవడంతో మహేష్ మరో దర్శకునితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారని అందుకే వంశీకు తన 28వ అవకాశం ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తుంది.మరి ఏది ఏమైనప్పటికీ ఈ సమయంలో ఏదొక అధికారిక ప్రకటన వస్తే అభిమానుల్లో కూడా ఈ గందరగోళ వాతావరణానికి తెర పడినట్టు ఉంటుంది.