వివాదంలో నాగశౌర్య ఫ్యామిలీ…ఇలా అయితే కెరీర్ కి కష్టమే
ప్రతి సినిమాతో ఓ మెట్టు ఎక్కాలని ప్రయత్నించే హీరోల్లో నాగశౌర్య ఒకరు. సొంత నిర్మాణ సంస్థలో తన అభిరుచికి తగ్గ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇటీవల నాగశౌర్య నటించిన అశ్వద్ధామ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల తర్వాత నాగశౌర్యతో పాటు అయన కుటుంబం వివాదాల్లో చిక్కుకున్నారు. వెంకీ కుడుములు వివాదం ఓ వైపు కొనసాగుతూనే…. తాజాగా మొహరీన్ ఓ అంశం మీడియాలో కాంట్రవర్సీ గా మారింది.
ఆ వివరాల్లోకి వెళితే……. అశ్వద్దామా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న నాగశౌర్య… వెంకీ కుడుములతో ఉన్న వివాదాన్ని లేవనెత్తారు. తనకు మాకు కొంత గ్యాప్ ఉన్న మాట వాస్తవమే…. మా అమ్మ గిఫ్ట్ గా ఇచ్చిన కారును అమ్మేసుకోని బైక్ పై తిరుగుతున్నారు అంటూ కామెంట్ చేశారు. దాంతో ఈ అంశం మీడియాలో వివాదంగా మారింది. ఇదే విషయంపై వెంకీ కుడుముల స్పందిస్తూ.. నాగశౌర్య చెప్పినట్టు కారును అమ్మలేదు.
ఆయన చెప్పిందంతా అబద్ధం. ఏదో విషయంలో అందరికీ ఎవరో ఒక్కరితో విభేదాలు ఉంటాయి. నాగశౌర్యతో కొంత విభేదాలు ఉన్న విషయం నిజమే. కానీ ఆ విషయాలు బయటకు మాట్లాడుకోవడం అప్రస్తుతం అని అన్నారు.ఇదిలా ఉంటె తాజాగా…. మొహరీన్ తో నాగశౌర్య తండ్రి గొడవ విషయం వెలుగులోకి వచ్చింది. అశ్వద్ధామ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భముగా మొహరీన్ ను ఆహ్వానిస్తే… తనకు అనారోగ్యంగా ఉందని రావడానికి నిరాకరించారట.
అయితే ప్రముఖదర్శకుడు రాఘవేంద్రరావు చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు.. తప్పనిసరిగా రావాల్సిందేనని లేకపోతే హోటల్ బిల్లు చెల్లించేది లేదని అన్నారట. ఇలా నాగశౌర్య తండ్రి తప్పనిసరిగా రావాల్సిందే అని పట్టుబడితే…. గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది అనే వార్త పరిశ్రమలో చెక్కర్లు కొట్టింది. మీడియా లో మంచి పేరు ఉన్న నాగశౌర్య కుటుంబం ఇలా వివాదాల్లో కూరుకుపోవడం చర్చినీయాంశంగా మారింది.