వాణిశ్రీ తో జరిగిన గొడవతో చివరి వరకు తనతో మాట్లాడని విజయ నిర్మల..బయటపడ్డ నిమ్మలేని నిజాలు!
ఒక్కోసారి ఏది మాట్లాడినా బాగా కనెక్ట్ అవుతారు. అదే ఒక్కోసారి ఏం మాట్లాడినా తేడా వచ్చేస్తుంది. దాంతో మాట పట్టింపులు వచ్చేస్తాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా కొందరి మధ్య ఇలాంటి మాటపట్టింపులు గతంలో ఉండేవి. అప్పట్లో ఆమె డేట్స్ దొరికితే చాలు అదే భాగ్యం అనుకునేలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నెల్లూరు నెరజాణ వాణిశ్రీ కి,మరో స్టార్ హీరోయిన్ కమ్ డైరెక్టర్ విజయనిర్మల మధ్య ఇలాగే తేడా వచ్చింది.
ఈ తేడా రావడానికి కారణం ఒక నాటకం. వాణిశ్రీ ,రమాప్రభ వేసిన ఆ నాటకంలో వాణిశ్రీ లేటుగా వస్తుంది. ఏం లేటయింది అని రమాప్రభ అడగాలి. వాణిశ్రీ ఇచ్చిన జవాబు విజయనిర్మల పెద్ద కోపానికి కారణం అయింది. ‘ఎప్పుడో 20ఏళ్ళక్రితం వచ్చిన దేవదాసు కోసం ఇప్పటికీ జనాలు టికెట్ల కోసం థియేటర్ల దగ్గర కొట్టుకు చస్తూ ఉంటె,ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే,.. అదే కృష్ణ , విజయనిర్మల కల్సి నటించిన దేవదాసు సినిమా కలెక్షన్స్ లేక ఈగలు తోలుతోంది’అంది.
ఇక ఈ డైలాగ్ లకు అప్పట్లో జనం విరగబడి నవ్వేవారు. ఇది ఒకసారో రెండుసార్లో కాదు,నాటకం వేసిన ప్రతిసారి ఇదే డైలాగ్ కావడంతో ఇది ఆనోటా ఈనోటా విజయనిర్మల కు చేరడంతో వాణిశ్రీ ని ఎడాపెడా దులిపేసిందట. ‘ఏం పనేం లేదా.. నా సినిమా ఎలా కామెంట్ చేస్తావ్ ‘అని అడిగేసిందట. అసలే పొగరు,ఆత్మాభిమానం గల వాణిశ్రీకి చాలా కోపం వచ్చేసింది. అందుకే అప్పటినుంచి ఇద్దరి మధ్యా ఎడ మొగం,పెడ మొగం అయింది.
కృష్ణ ,వాణిశ్రీ కల్సి ఎన్నో హిట్ మూవీస్ చేసారు. షూటింగ్ లో సరిగ్గానే యాక్ట్ చేసినా, షూటింగ్ అయ్యాక కృష్ణతో కూడా వాణిశ్రీ ఒక్కమాట కూడా మాట్లేడేది కాదట. ఇక కృష్ణ, వాణిశ్రీ తో కల్సి నటించడం ఇష్టంలేక ఏ సినిమాను కూడా విజయనిర్మల ఒప్పుకోలేదట. ఆవిధంగా ఓ నాటకంలో డైలాగ్ కారణంగా చివరిదాకా వాణిశ్రీతో విజయనిర్మల మాట్లాడలేదు.