సావిత్రమ్మ గారి అబ్బాయికి హీరో అర్జున్ కి ఉన్న సంబంధం తెలిస్తే ఊహించలేరు
తెలుగు బుల్లితెరపై వస్తున్న సావిత్రమ్మ గారి అబ్బాయిసీరియల్ లో నటించే బాలరాజు ఆడియన్స్ కి సుపరిచితుడే. చదువు లేకుండా కేవలం అమ్మ మాట మాత్రమే వినే క్యారెక్టర్ బాలరాజు చాలా మూర్ఖంగానే ఉంటాడు. ఒక్కరోజు కూడా సీరియల్ మిస్ కాకుండా బాలరాజు క్యారెక్టర్ పండుతోంది. బాలరాజు పాత్ర పోషిస్తున్న వ్యక్తి పేరు చందన్ కుమార్.
తెలుగు బాష కూడా రాని చందన్ కుమార్ ,ఒకప్పటి యాక్షన్ హీరో అర్జున్ తో గల ఫొటోస్ విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి నడుమ గల సంబంధం ఏమిటి అని ఆలోచిస్తే,కన్నడకి చెందిన అర్జున్ తెలుగు,తమిళ,కన్నడ భాషల్లో ఓ పాపులర్ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా మంచి హీరోయిన్. బాలరాజు క్యారెక్టర్ వేసిన చందన్ కుమార్,ఐశ్వర్య కల్సి 2019లో ప్రేమ బరహా అనే కన్నడ మూవీలో చేసారు.
అర్జున్ భార్య నిర్మించిన ఈ సినిమాకు హీరో అర్జున్ డైరెక్ట్ చేసాడు. కూతురు హీరోయిన్,ఇక చందన్ కుమార్ హీరో. ఇక ఈ మూవీ కన్నడంలో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. తమిళంలో డబ్ చేస్తే ఓ మోస్తరుగా ఆడింది. ఆతర్వాత కన్నడంలో చందన్ కి ఛాన్స్ లు అంతగా రాలేదు. టాలీవుడ్ మాత్రం ఆహ్వానించింది. సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ తో అదరగొడుతూ,కన్నడ సీరియల్స్ లో కూడా చేస్తున్నాడు.