సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సెలబ్రెటీస్ …వీరే…!
సినిమాల్లో ప్రేమలు పెళ్లిళ్లు మామూలే. అయితే కొందరివి అనుకోకుండా సీక్రెట్ గా జరిగాయి. అందులో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు,నమ్రత ల పెళ్లి ప్రస్తావించాలి. వంశీ మూవీలో ఏర్పడ్డ పరిచయం పెళ్ళికి దారితీసింది. అయితే మీడియా కంట పడకుండా సీక్రెట్ గా పెళ్లిచేసుకున్నారు. ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారు. అయితే అలనాటి సావిత్రి నుంచి ఇలా సీక్రెట్ పెళ్లిళ్లు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో పెళ్లయి పిల్లలున్న జెమిని గణేష్ ని సావిత్రి సీక్రెట్ గా గుళ్లో పెళ్లిచేసుకుంది.
నాలుగేళ్ల వరకూ సావిత్రి,జెమిని పెళ్లి గురించి ఎవరికీ తెలియలేదు. అయితే ఆతర్వాత ఫోటోలు బయటపడడంతో అందరూ షాకయ్యారు. అప్పట్లో ధర్మేంద్ర ,హేమమాలిని కూడా రహస్యంగానే పెళ్లిచేసుకున్నారు. అప్పటికే ధర్మేంద్రకు పెళ్లయి,పిల్లలున్నారు. అలాగే అందాల తార శ్రీదేవి ,బోనీ కపూర్ ఎవరికీ తెలియకుండా పెళ్లాడారు. అప్పటికే పెళ్లయిన బోనీని పెళ్లిచేసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా సీక్రెట్ గా మేరేజ్ చేసుకున్నారు. జూహ్లీ చావ్లా కూడా ప్రేమించి రహ్యస్యంగా పెళ్లిచేసుకుంది. ఇక తాజాగా పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిశ్రుత్ చౌహన్ సీక్రెట్ గా బిజినెస్ మేన్ నిఖిల్ జైన్ ని పెళ్ళిచేసుకుని సంచలనం క్రియేట్ చేసింది.