MoviesTollywood news in telugu

Tollywood Directors:టాలీవుడ్ లో డైరెక్టర్స్ తొలి సినిమాకు వారి వయసు ఎంతో తెలుసా?

Tollywood Directors:మన తెలుగులో సినిమాలను డైరెక్ట్ చేస్తున్న దర్శకులు తమ మొదటి సినిమాకు దర్శకత్వం వహించే సమయానికి ఎంత వయస్సు కలిగి ఉన్నారో చూస్తే షాకవుతారు. 1942 మే23న జన్మించిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు 33 ఏళ్ళ వయస్సులో బాబు మూవీ ద్వారా 1975లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. 1956 జూన్ 2న జన్మించిన మణిరత్నం 27ఏళ్ళకి డైరెక్టర్ అయ్యారు. పల్లవి అను పల్లవి మూవీతో ఎంట్రీ ఇచ్చారు.

1989లో శివ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రామ్ గోపాల వర్మకు అప్పుడు 27ఏళ్ళు. 1962ఏప్రియల్ 7న వర్మ పుట్టాడు. 1966సెప్టెంబర్22న జన్మించిన పూరి జగన్నాధ్ 2000సంవత్సరంలో అంటే 34ఏళ్ళ వయస్సులో బద్రీ సినిమాకు డైరెక్షన్ చేసాడు. ఇక అదే ఏడాది చిత్రం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ తేజ 1966ఫిబ్రవరి 22న జన్మించాడు. తొలిసినిమా చేసే సమయానికి అతడి వయస్సు 34ఏళ్ళు.

1972ఫిబ్రవరి 4న పుట్టిన శేఖర్ కమ్ముల1993లో అంటే 27ఏళ్ళ వయస్సులో డాలర్ డ్రీమ్స్ మూవీకి డైరెక్షన్ చేసాడు. అలాగే 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఎస్ ఎస్ రాజమౌళి 28ఏళ్ళ వయస్సులో డైరెక్టర్ అయ్యాడు. యితడు 1973అక్టోబర్ 10న జన్మించాడు. 1979 సెప్టెంబర్28న పుట్టిన వంశీ పైడిపల్లి 2007లో అంటే 28సంవత్సరాల వయస్సులో మున్నా మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.

2002లో నువ్వే నువ్వే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన 1971నవంబర్ 7న త్రివిక్రమ్ శ్రీనివాస్ జన్మించాడు. మొదటి సినిమా డైరెక్ట్ చేసే సమయానికి అతడి వయస్సు 31సంవత్సరాలు. 33ఏళ్ళ వయస్సులో 2015లో పటాస్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి 1982నవంబర్ 23న జన్మించాడు. 2015లోనే నాగ అశ్విన్ ఎవడె సుబ్రహ్మణ్యం మూవీ తో డైరెక్టర్ అయ్యాడు. 1990లో యితడు జన్మించి,25ఏళ్లకే డైరెక్టర్ అయ్యాడు.

డైరెక్టర్ క్రిష్ 30ఏళ్ళ వయస్సులో గమ్యం మూవీతో డైరెక్టర్ అయ్యాడు. 1978నవంబర్ 10న పుట్టిన యితడు 2008లో ఎంట్రీ ఇచ్చాడు. నీకోసం మూవీ ద్వారా 27ఏళ్ళవయసులో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ శ్రీను వైట్ల 1972సెప్టెంబర్ 27న జన్మించాడు. 2014లో 24ఏళ్ళవయస్సులో రన్ రాజా రన్ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సుజిత్ 1990అక్టోబర్ 25న జన్మించాడు.

2016లో పెళ్లి చూపులు సినిమా ద్వారా27ఏళ్ళవయస్సులో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన డి తరుణ్ భాస్కర్ 1988నవంబర్ 5న జన్మించాడు. అర్జున్ రెడ్డి సినిమాతో2017లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ 1981డిసెంబర్ 25న జన్మించాడు. తొలి సినిమా సమయానికి అతడి వయస్సు 36సంవత్సరాలు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u