MoviesTollywood news in telugu

Tollywood comedians:వీళ్ళు కమెడియన్స్ మాత్రమే కాదు…వీరిలో ఉన్న ఆ అసలు టాలెంట్ ఏంటో తెలుసా?

Tollywood comedians:మొదటి నుంచి సినిమాల్లో కామెడీకి పెద్దపీట ఉండేది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల సమయంలో హీరోలతో సమానంగా కమెడియన్స్ కి డిమాండ్ ఉండేది. కామెడీ కోసం ఓ ట్రాక్ కంప్లసరీగా ఉండేది. వాళ్లకి హీరోయిన్స్ ఉండేవారు. ఇలా చాలామంది హాస్య నటులు సత్తా చాటారు. కమర్షియల్ సినిమాల్లో కూడా కామెడీ తప్పనిసరి. ఇక కొందరు రచయితలుగా ఎంట్రీ ఇచ్చి కామెడియన్స్ గా మారారు. అందులో పోసాని కృష్ణ మురళి ని ప్రధానంగా చెప్పుకోవాలి.

రచయితగా ఉండగా నటుడిగా ఛాన్స్ లు రావడంతో రైటింగ్ ఆపేసి నటుడిగా రాణిస్తున్నాడు. శివ లాంటి సూపర్ హిట్ మూవీకి రచయితగా చేసిన తనికెళ్ళ భరణీ లాంటి వ్యక్తి సైతం ఎక్కువ ఛాన్స్ లు రావడం వలన రైటర్ గా ఫుల్ స్టాప్ పెట్టేసి నటుడిగా,కమెడియన్ గా రాణిస్తున్నారు. శివ తత్త్వం వివరిస్తూ రచనలు సాగిస్తున్నాడు. మిధునం లాంటి మూవీతో నేషనల్ లెవెల్లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక 750సినిమాలకు రచనలు చేసిన ఎం ఎస్ నారాయణ పెదరాయుడు మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి,క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా రాణించాడు. మూడు సినిమాలకు డైరెక్షన్ కూడా చేసాడు అధ్యాపకుడుగా కూడా పనిచేసారు.

కాగా తనదైన స్టైల్లో 500సినిమాల్లో నటించిన డైలాగ్ రైటర్ ఎల్బీ శ్రీరామ్ తన కామెడీతో జనానికి నటుడిగా బాగా దగ్గరయ్యాడు. రచయితగా పనిచేసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఏప్రియల్ 1విడుదలతో మొదలైన కృష్ణ భగవాన్ కెరీర్ 350సినిమాల్లో కొనసాగుతోంది. రచయితగా డిటెక్టివ్ నారద వంటి సినిమాలకు పనిచేసాడు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u