మారుతిరావు ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
అమృత ప్రణయ్‌ల ప్రేమ వ్యవహారం ఏ స్థాయిలో చర్చనీయాంశం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురును ప్రణయ్ ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు అనే కోపంతో అమృత తండ్రి మారుతి రావు ప్రణయ్‌ని హత్య చేయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
కేసు నిర్ధారణ కాకున్నా కూడా ఆయనే చంపించాడు అంటూ అమృత బలంగా నమ్ముతుంది.ఇక కేసు విచారణ తుది తీర్పుకు వస్తున్న నేపథ్యంలో మారుతి రావు ఆత్మహత్య చేసుకున్నాడు.మారుతి రావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన ఆస్తులకు సంబంధించిన విషయాలు చర్చనీయాంశం అయ్యాయి.బినామీలను పక్కన పెడితే ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు దాదాపుగా 250 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు.
రైసు మిల్లులు, రియల్ ఎస్టేట్ భూములు, హాస్పిటల్ ఇలా అన్ని కలిపి బహిరంగ మార్కెట్‌లో 250 కోట్ల వరకు పలుకుతున్నట్లుగా సమాచారం.కిరోసిన్ డీలర్ గా చేసిన మారుతి రావు ఇంత ఆస్తులు సంపాదించాడా అంటూ అంతా నోరు వెళ్లబెతున్నారు.అయితే ఆ ఆస్తులు ఏవీ కూడా తనకు వద్దంటూ అమృత ఇప్పటికే చెప్పిన విషయం తెల్సిందే.