కాలర్ ట్యూన్ లాగా ఈ కరోనా ట్యూన్ ఏంటి అనుకుంటున్నారా? ఈ ట్రిక్ ఫాలో అయితే స్కిప్ చేయొచ్చు
కాలర్ ట్యూన్ ట్యూన్ పోయి కరోనా ట్యూన్ వచ్చింది. ప్రస్తుతం ఎవరికీ ఫోన్ చేసిన ఫస్ట్ ఒకరు దగ్గుతారు ఆ తర్వాత కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారు. సరే ఒకసారి చెప్పారంటే బాగానే ఉంటుంది. కాల్ చేసిన ప్రతిసారి అదే రావడంతో ఫోన్ చేయాలంటే విసుగు వస్తుంది చాలా మందికి. కాబట్టి అది స్కిప్ చేసి డైరెక్ట్ రింగ్ అవ్వాలి అంటే ఏం చేయాలో తెలుసా.? మీరే చూడండి.
ఫోన్ డయల్ చేసిన తర్వాత కరోనా ప్రికాషన్ స్టార్ట్ అవ్వగానే వెంటనే “1” డయల్ చేయండి. అప్పుడు డైరెక్ట్ కాల్ కనెక్ట్ అవుతుంది. ఈ ట్రిక్ కొన్ని నెట్వర్క్స్ లో పని చెయ్యట్లేదు. మీకు వర్కౌట్ అవుతుందో లేదో ట్రై చేయండి.