Movies

సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో మెరిసిన టాలీవుడ్ హీరోస్ వీరే… !

ప్రస్తుత కాలంలో ఓ సినిమా బాగా ఆడాలంటే హీరో ఎలివేషన్,హీరోయిన్ అందాల ఆరబోత,కామెడీ ,.. ఇవే ఉంటె చాలదండి అదిరిపోయే ముద్దుగుమ్మతో ఐటమ్ సాంగ్ కూడా ఉండి తీరాల్సిందే. అప్పుడే పూర్తిగా కమర్షియల్ విలువలున్న సినిమా అవుతుంది. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని అప్పట్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి,సిల్క్ స్మిత,అనూరాధ, డిస్కో శాంతి, ముమైత్ ఖాన్ ఇలా ప్రత్యేకంగా ఐటెం సాంగ్ కి కొందరుండేవారు. ఇలా ఐటెం సాంగ్స్ చేసేవాళ్లకు సినిమాల్లో గుర్తింపు ఉండేది. అందుకే వీళ్ళ హవా కొనసాగేది.

అయితే రాను రాను హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్ కి జై కొట్టడంతో ఐటెం సాంగ్ కి డిమాండ్ పెరిగిపోయింది. ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుంటే మరో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడం చూస్తున్నాం. అలాగే స్టార్ హీరోస్ కూడా ఐటెం సాంగ్ లలో చేయడం కూడా వస్తోంది. హీరో విజయ దేవరకొండ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ని హీరోగా ఎంట్రీ ఇప్పిస్తూ తానే నిర్మించిన మూవీలో విజయ్ ఓ ప్రమోషన్ సాంగ్ లో నటించాడు. ఈ సాంగ్ ద్వారా సినిమాకు హైప్ క్రియేట్ చేసాడు.

అంతెందుకు గతంలో బాలయ్య,అక్కినేని నాగేశ్వరరావు కల్సి నటించిన గాండీవం మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ సాంగ్ లో నటించి అదరగొట్టాడు. ఈ మూవీ మంచి సక్సెస్ అయింది. ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల మూవీలో సూపర్ స్టార్ కృష్ణ జుంబారే అంటూ వచ్చే స్పెషల్ సాంగ్ లో నటించి సినిమాకి హైప్ తెచ్చాడు. అప్పట్లో ఇది సంచలనం అయింది. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఘటోత్కచుడు మూవీలో కింగ్ నాగార్జున ఓ స్పెషల్ సాంగ్ లో నటించి హైప్ తెచ్చాడు. ఈ మూవీ హిట్ కొట్టడంతో పాటు నాగ్ సాంగ్ కూడా బాగా హిట్ అయింది.