Movies

ఈ జబర్దస్త్ కమెడియన్ ని గుర్తు పట్టారా…కష్టమే…వెంటనే చూసేయండి

అందరూ అన్ని వేళలా ఒకేలా ఉండరు. కందరి రూపు రేఖలు చిన్నప్పటి నుంచీ ఒకేలా ఉంటాయి. ఈజీగా గుర్తుపట్టేయొచ్చు కానీ కొందరి రూపు చూస్తే చాలా తేడా వచ్చేస్తుంది. అందుకే అంతలా మారిపోయావేంటి,అసలు గుర్తుపట్టలేదు అని పాత ఫ్రెండ్స్ కలిసి నపుడు అనుకోవడం చూస్తుంటాం. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. ఇప్పడు ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి జబర్దస్త్‌లో పేరున్న కమెడియన్. గతంలో చాలా సినిమాల్లో నటించాడు.

కానీ ఇప్పుడు చూస్తే, ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే అప్పటి రూపం, ఇప్పుడు కనిపించే రూపం అలా ఉంటాయి మరి. అతడే జబర్దస్త్ కమెడియన్ నవీన్. దర్శకుడు రాఘవేంద్రరావు డూప్‌గా జబర్దస్త్‌లో నవ్వులు పూయించే యితడు అదిరే అభి టీమ్‌లో చిత్ర విచిత్ర వేషధారణలు, వైరైటీ డైలాగ్‌ డెలివరీతో జోకులు వేస్తూ, అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాడు.

నిజానికి గతంలో పలు సినిమాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాల్లో నవీన్ కనిపించాడు. స్టూడెంట్ నెం.1, సుబ్బు, అశోక్ వంటి మూవీలో చేసాడు. ఈ విషయాన్నీ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడే చెప్పుకొచ్చాడు. అప్పుడు తనకు జుట్టు బాగా ఉండేదని, కానీ ఇప్పుడు జుట్టూ ఊడిపోయి, గుబురు గడ్డం ఉండడంతో, ఎవరూ పోల్చుకోలేరని అన్నాడు. గతంలో ఓసారి మిత్రులతో కలిసి ఎన్టీఆర్ ఇంటికి కూడా వెళ్లానని.. ఆయన చాలా బాగా చూసుకున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తని కూడా చెప్పాడు. రామయ్యా వస్తావయ్యా మూవీ సమయంలో ఎన్టీఆర్ తనను చూసి గుర్తుపట్టలేకపోయారని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. అందుకే అప్పట్లో ఒత్తైన జట్టుతో ఉండేవాడివి కదా, ఇలా అయ్యావేంటని అడిగినట్లు గుర్తుచేసుకున్నాడు.