Movies

మావయ్య అడుగు జాడల్లో అల్లుడు..భారీ విరాళం ఇచ్చిన భరత్.!

తెలుగు దేశం పార్టీ అధినేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కొడుకు మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు కరోనా బాధితుల సహాయార్ధం రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమ నిధులకు మరియు తెలుగు చలన చిత్ర పరిశ్రమలకు ఏకంగా ఒక కోటి 25 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించి తన ఉన్నత మనసును చాటుకున్నారు.

అయితే ఇప్పుడు బాలయ్య అల్లుడు మరియు తెలుగుదేశం పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ తన వంతు సాయంగా మామ అడుగు జాడల్లో నడుస్తూ తాను కూడా ఒక కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక సహాయ నిధికి కూడా విరాళం ఇవ్వడం విశేషం. ఆంధ్ర రాష్ట్ర సహాయ నిధికి 50 లక్షలు అలాగే తెలంగాణా మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెరో 25 లక్షలు అందజేశారు. గత కొన్ని రోజుల క్రితం భరత్ ఎలాంటి విరాళం ఇవ్వలేదని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే.