విజయ్ దేవరకొండ ఈ పరిస్థితిలో ఏమి చేస్తున్నాడు…కామ్ గా ఎందుకు ఉన్నాడో?
కరోనా కల్లోలం రాకముందు ఎంటర్ ది డ్రాగన్ లా కరోనా ఎంటర్ కాకముందు ఎటు చూసినా రౌడీ రౌడీ రౌడీ అంటూ మార్మోగిపోయిన విజయ్ దేవరకొండ పేరు ఒక్కసారిగా వినిపించడంలేదు. రౌడీ స్టార్ ఫ్యాన్స్ ఫీలింగ్ ప్రస్తుతం ఇలాగే ఉందట. నిజానికి నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉండే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఉన్నట్టుండి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. లాక్ డౌన్ అయినా కేసీఆర్ అభిమానిగా కనీసమాత్రంగా అయినా స్పందించనే లేదని కూడా గుర్తుచేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ కూడా కరోనా పంజా పై, కనీసం బాధ్యత గల సెలబ్రిటీగా కనీస సాయం ప్రకటించలేదని,అలాగే కాస్తయినా అవేర్ నెస్ లో భాగంగా అసలు స్పందించకపోవడం దారుణమని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
ఎందుకంటే కరోనా విపత్కర సమయంలో దాదాపు టాలీవుడ్ సెలబ్రిటీలంతా కరోనా గురించి మాట్లాడ్డమే కాదు, తోచిన సహాయం కూడా చేసారు. కానీ రౌడీస్టార్ మాత్రం ఇవేవీ పట్టనట్లే వ్యవహరించడం విమర్శలకు టీవిచ్చింది. 2019 ది మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా,యువతరానికి స్ఫూర్తిగా చెప్పుకున్నారు. అలాంటి వాడు ఇప్పుడు ఏమయ్యాడు? అంటూ అంతా టార్చ్ వేసి వెతుకుతున్నారు. నిజానికి ఈమధ్య విజయ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తా కొడుతున్న నేపథ్యంలో విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` మూవీలో నటిస్తున్నాడు. ముంబైలో చిత్రీకరణ సాగుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పటికే దర్శకుడు పూరి ఎంతో స్ఫూర్తివంతమైన వీడియోలతో ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఆయన గురువు ఆర్జీవీ సైతం తనదైన శైలిలో అంతో ఇంతో భయపెట్టి అయినా మేలు చేశాడు. కానీ విజయ్ మాత్రం ఏదీ చేయలేదెందుకో!
అయితే తాజాగా జూబ్లీహిల్స్ లో కొనుక్కున్న తన కొత్త ఇంట్లో మాతృమూర్తి తో కలిసి ఎంతో ట్రెడిషనల్ గా కనిపించాడు. తెలుపు రంగు ధవళ వస్త్రాలు ధరించి దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత రౌడీ ఇలా కనిపించేసరికి అభిమానులు హమ్మయ్య అనుకున్నారు. అయితే ఈ ఫోటో కూడా విజయ్ కాకుండా అభిమాని ఎవరో షేర్ చేయడం తో బయటకు వచ్చింది. లేదంటే అదీలేదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బాసటగా.. తన తల్లి గారితో కలిసి లైట్లు ఆఫ్ చేసి దీపాలు వెలిగించిన సన్నివేశం ఆ ఫోటో. ఇక ఇలాంటి విపత్కర సమయంలో సస్పెన్స్ కొనసాగిస్తూ విజయ్ అలా ఎందుకున్నాడన్న ప్రశ్నలు సంధి స్తున్నారు. అసలు రౌడీస్టార్ ఇంటర్నల్ ఫీల్ ఏమిటీ? ఇలా మౌనంగా ఉండటం క్రేజీగా ఉంటుందనా? లేక ఇదో టైపు ప్రచారామా? ఇలా పలు ఊహగానాలు వస్తున్నాయి.