చైతూ,సమంతాకి ఇల్లు ఇవ్వడానికి నిరాకరించిన మురళీమోహన్…ఎందుకో తెలుసా?
సినిమా వాళ్లకి ,రాజకీయాలకు ఎప్పటి నుంచో సంబంధం ఉంది. కొందరు రాజకీయాల్లో సక్సెస్ అవుతారు. కొందరు అవ్వరు. ఇక మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి అధ్యక్షునిగా చేసిన ఒకనాటి హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీమోహన్ తెలుసు కదా. రాజమండ్రి నుంచి ఆయన ఎంపీగా కూడా గతంలో ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు సమంతతో కలిసి నాగ చైతన్య మురళీ మోహన్ ఇంటిలోనే ఉంటున్నారు. ఆయన దగ్గర్నుంచే చైతూ కొన్నాడు. అయితే దీని వెనక చాలా పెద్ద కథ నడిచింది. పెళ్లి తర్వాత ప్రత్యేకంగా ఓ ఇల్లు తీసుకోవాలని తిరుగుతున్న సమయంలో చాలా ఇళ్లు చూసిన చైతూకు ఒక్కటి కూడా నచ్చలేదు. ప్రతీ ఇంట్లో ఏదో ఓ సమస్య కనిపిస్తూనే ఉండటంతో విసిగెత్తిపోయిన సమయంలో మురళీ మోహన్ ఇల్లు చూసాడు. అది బాగా నచ్చేయడంతో వెళ్లి అంకుల్ ఇది నాకు కావాలని చైతూ అడిగేసాడు.
అయితే మురళీ మోహన్ మాత్రం ఇది అమ్మడానికి కాదు బాబు.. తనకు, తన కొడుకు, తన తమ్ముడి కోసం ప్రత్యేకంగా కట్టుకున్నామని చెప్పేశాడట. అయితే ఇల్లు బాగా నచ్చడంతో వెంటనే ఇంటికి వెళ్లి తండ్రి నాగార్జునకు విషయం చెప్పాడు. అంతే వెంటనే నాగ్ రంగంలోకి దిగాడు. సిటీలో ఎన్నో ఇళ్ళు చూసిన చైతూకు మీ ఇల్లు మాత్రమే బాగా నచ్చింది. ఓసారి చూడండి మురళీ మోహన్ గారూ అంటూ నాగ్ రిక్వెస్ట్ చేసాడు. అక్కినేని కుటుంబంతో చాలా మంచి అనుబంధం ఉండడం, కలిసి చాలా సినిమాలు కూడా చేయడంతో మురళీమోహన్ మనసు మార్చుకున్నాడు.
ఇంటికి వెళ్లి బాబు చెప్పినట్లున్నాడు అందుకే వెంటనే నాగార్జున కూడా తనకు ఫోన్ చేసి విషయం చెప్పాడని మురళీమోహన్ ఊహించాడు. చైతూ ఇష్టాన్ని కాదనలేక.. తన కొడుకు మరో ఇంటికి మారిపోవడంతో తన కొడుకు కోసం కట్టిన ఫ్లాట్‌ను చైతూకు ఇచ్చేసానని మురళీ మోహన్ చెప్పాడు. 14వ ఫ్లోర్‌లో పూర్తిగా సౌకర్యాలతో ఉండే ఈ ఇంటిని మనసు పడి మరీ కొనుక్కున్నాడు చైతూ.ప్రస్తుతం అక్కడే సమంతతో కలిసి నాగ చైతన్య ఉంటున్నాడు . ఆ పక్కనే మురళీ మోహన్.. ఆయన తమ్ముడు కూడా ఉంటున్నారు. అందులోనే జిమ్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి.