ఫేస్ మాస్కులను ధరిస్తున్నారా? ఈ తప్పులు అసలు చేయొద్దు…ఎందుకంటే…
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మాస్కులు కొనుగోలు చేయడం కుదరకపోతే ఇంట్లో చేసిన మాస్కులను ధరించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. దీంతో ప్రజలంతా మాస్కులను ధరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ మాస్కులను సక్రమంగా ధరించాల్సి ఉంటుంది.
లేకపోతే ధరించినా ఫలితం ఉండదు. మాస్కులను ధరించే విషయంలో ఏం చేయాలి, ఏం చేయొద్దో తెలుసుకుందాం. మాస్కును ముక్కు కిందకు వదిలియొద్దు. గవద భాగం కనిపించేలా కట్టుకోవద్దు. రెండు పక్కలా గ్యాప్ ఉండేలా మాస్కులను లూజ్‌గా కట్టుకోవద్దు. మాస్కును గడ్డం కిద్దకు నెట్టొద్దు. ముక్కు అంచును మాత్రమే కవర్ చేసేలా మాస్క్ ధరించొద్దు.
నోరు, ముక్కు, గవద భాగంతోపాటు ముఖం మొత్తం కవర్ చేసేలా.. మాస్కు ధరించాలి. మాస్క్ దారాలను బిగుతుగా కట్టుకోవాలి. మాస్కులు ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడతాయి కానీ.. అవి కల్పించే భద్రత గురించి తప్పుగా ఊహించుకోవద్దు. మాస్కు ధరించడానికి, తీసేయడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. క్లాత్‌తో చేసిన మాస్క్ అయితే వాడిన తర్వాత శుభ్రంగా ఉతికేసి ఒక పూట ఎండలో ఆరవేయాలి.
ఈ జాగ్రత్తలను తీసుకుంటూ మాస్క్ లను ధరిస్తే మంచిది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అలాగే ఎవరైనా మాస్క్ ధరించకపోతే మొహమాటం పడకుండా ధరించమని చెప్పాలి. అప్పుడే అందరూ రక్షణగా ఉంటాం.