మహేష్,నమ్రత కలిసి తీసుకున్న షాకింగ్ నిర్ణయం … సక్సెస్ అవుతారా…రిస్క్…?
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు కేవలం తన సినిమాల నుంచి మాత్రమే కాకుండా అనేక వ్యాపార లావాదేవీలు మరియు ప్రకటనలు ఎన్నో మరెన్నో ఉన్నాయి. అలా కేవలం వీటితో సరిపెట్టుకొని కేవలం తన స్వార్ధం చూసుకోకుండా ఎన్నో మంచి పనులు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మహేష్ తన కెరీర్ లో మరో సరికొత్త ఇన్నింగ్స్ ను మొదలు పెట్టబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మహేష్ వెండితెరపై నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈసారి నుంచి డిజిటల్ గా ఎంతో పాపులర్ గావించిన వెబ్ సిరీస్ లను నిర్మించే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. మహేష్ మరియు తన భార్య నమ్రత కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా వారు చేసుకున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ మధ్య చాలా మంది సెలెబ్రెటీలు కూడా ఈ డిజిటల్ రంగంలోకి దిగి కూడా సక్సెస్ అయ్యారు. మరి మహేష్ కూడా సక్సెస్ అవుతారో లేదో చూడాలి.