వాసు సినిమా వెనక ఉన్న కొన్ని నమ్మలేని నిజాలు
తెలుగులో ప్రముఖ దర్శకుడు ఏ కరుణాకరన్ అప్పట్లో దర్శకత్వం వహించినటువంటి “వాసు” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంది.ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ నటించగా బ్యూటీ క్వీన్ భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది.అయితే ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి వసూళ్లను కూడా రాబట్టింది.అంతేగాక సంగీతం పరంగా కూడా మంచి హిట్ అయ్యింది.
అయితే ఈ చిత్రంలో సీనియర్ నటుడు స్వర్గీయ రంగనాథ్, విజయ్ కుమార్, సునీల్, అలీ, బ్రహ్మాజీ, శివారెడ్డి, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.ఈ చిత్రం 2002వ సంవత్సరంలోని ఏప్రిల్ పదో తారీఖున విడుదలయింది.ఈ చిత్రం విడుదలై 18 సంవత్సరాలు కావస్తోంది.దీంతో ఈ విషయాన్ని విక్టరీ వెంకటేష్ అభిమానులు నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు.
అంతేగాక ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైనటువంటి ఈ చిత్రం బి సి సెంటర్లలో 50 రోజులకు పైగా ఆడింది.దీంతో విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్లో ఈ చిత్రం ఓ మంచి మైలురాయిగా నిలిచిపోయింది.
ఈ చిత్రంలో అనుకున్న లక్ష్యం సాధించడం కోసం ఓ యువకుడు పడే కష్టాలు, తాపత్రయం తదితర అంశాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.ఇక ఈ చిత్రంలో సునీల్, అలీ చేసేటువంటి కామెడీ సన్నివేషాలు ప్రెకషకులను కడుపుబ్బా నవ్వించడమేగాక ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి.