Movies

ఆ సినిమా చేసి తప్పు చేశా అంటున్న రకుల్…పాపం బలి అయింది

చిత్ర విచిత్రమైన చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలీదు. అందునా హీరోయిన్స్ అయితే ఎప్పుడు ఫామ్ లో ఉంటారో ఎప్పుడు డిజాస్టర్స్ మూటగట్టుకుని దెబ్బతింటారో అసలు చెప్పలేం. చాలామంది ఇప్పుడు మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్ గా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంటారు. ఫస్ట్ సినిమా సూపర్ హిట్టయితే ఇక టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోను వరుసబెట్టి స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ లు కొట్టేస్తారు. బ్లాక్ బస్టర్స్ తమ ఖాతాలలో వేసుకుంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఉద్దేశ్యంతో రెమ్యూనరేషన్ కూడా కోట్లలో డిమాండ్ చేస్తారు. అంతేకాదు, లక్కీ హీరోయిన్ అన్న టాగ్ తో మంచి రేంజ్ కి వెళతారు. ఒక్క సినిమా ప్లాప్ అయిందా ఇక ఎంత స్పీడ్ గా అయితే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంటారో అంతే ఫాస్ట్ గా డౌన్ అయిపోతారు.

అలా డౌన్ అయ్యాక ఛాన్స్ లొచ్చినా సరే, ఫ్లాపుల మీద ఫ్లాపులు పడి దెబ్బ మీద దెబ్బ పడి చేతిలో ఒక్క ఛాన్స్ కూడా లేకుండా ఇబ్బంది పడతారు. ఇలా వరుస ఫ్లాప్స్ తో చిత్ర పరిశ్రమ నుంచి డోర్స్ క్లోజ్ అయిపోయి, హీరోయిన్ గా ఒక్క ఛాన్స్ వచ్చినా చాలు అనుకుంటూ ఆతృత పడతారు. ఇలాంటి సమయంలోనే కొన్ని తప్పులు చేసి మరిన్ని ఇబ్బందుల్లో పడిపోతారు. సరిగ్గా బ్యూటి ఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అలాంటి తప్పే చేశానంటోంది. గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడి కెరీర్ డౌన్ ఫాల్ లో ఉంది. దానికి తోడు పూజాహెగ్డే – రష్మిక లాంటి లక్కీ హీరోయిన్స్ ని తట్టుకొని రకుల్ చతికిలబడిపోయింది.

అసలే అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ చివరకు వెటరన్ హీరో నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’ ఒప్పుకొని పెద్ద పొరపాటు చేసిందని అంటు న్నారు. పాపం కెరీర్ దెబ్బతిన్న స్టేజ్ లో వచ్చిన ఛాన్స్ కదా అని నటించి ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో మళ్ళీ కెరీర్ ఫాం లోకి వస్తుందని ఊహించుకుంది. అందుకే లిప్ లాక్స్ ఉన్నా, బోల్డ్ గా నటించాల్సి ఉందని తెలిసినా కెరీర్ మీద ఆశ పడి ఒప్పుకుంది. కానీ అక్కడే రాంగ్ స్టెప్ వేశానని ఇప్పుడు తెగ బాధ పడిపోతోంది. అయితే ఇవన్ని మర్చిపోయి ప్రస్తుతం నితిన్ సరసన ఒక సినిమాలో నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. నిజానికి రకుల్ కెరీర్ ఇలా అవడానికి కారణం తన స్వయంకృతాపరాధమే అంటున్నారు.