Movies

పవన్ కి శృతిహాసన్ కి మధ్య గొడవ… నిజం ఎంత?

గ‌బ్బ‌ర్ సింగ్, కాట‌మ‌రాయుడు సినిమాల్లో జంట‌గా క‌నిపించారు ప‌వ‌న్ క‌ల్యాణ్ – శ్రుతిహాస‌న్‌. ఇప్పుడు `వ‌కీల్ సాబ్‌`లోనూ వీరిద్ద‌రూ జోడీ క‌డ‌తారనుకున్నారు. కానీ `ఈ సినిమాలో నేను న‌టించ‌డం లేదు` అంటూ తేల్చి చెప్పేసింది శ్రుతి. నిజానికి అస‌లు ఈ సినిమా కోసం శ్రుతి పేరునే ప‌రిశీలించ‌లేదు. దానికి కార‌ణం… ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

కాట‌మ‌రాయుడు స‌మ‌యంలో శ్రుతిహాస‌న్ ప్ర‌వ‌ర్త‌న‌, ప‌ద్ధ‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి న‌చ్చ‌లేద‌ని స‌మాచారం. శ్రుతి ఏనాడూ చెప్పిన స‌మ‌యానికి సెట్ కి వ‌చ్చేది కాద‌ట‌. మరీ ముఖ్యంగా విదేశాల్లో పాట‌ల్ని తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు చిత్ర‌బృందాన్ని బాగా ఇబ్బంది పెట్టింద‌ని టాక్‌. ఈ స‌మ‌యంలోనే శ్రుతిని ప‌వ‌న్ మంద‌లించాడ‌ట‌. ఎన్నిసార్లు చెప్పినా శ్రుతి వైఖ‌రిలో మార్పు రాక‌పోయే స‌రికి `ఇక ఎప్పుడూ శ్రుతిహాస‌న్‌తో ప‌నిచేసేది లేదు` అని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పేశాడ‌ని, అలాంట‌ప్పుడు ఈ సినిమాలో శ్రుతిహాస‌న్ ని తీసుకోవాల‌ని ఆలోచ‌న చిత్ర‌బృందానికి ఎందుకు వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు.
ప‌వ‌న్ క‌ల్యాణ్ సెట్లో చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ఉంటాడు. మిగిలిన వాళ్లూ ప‌వ‌న్ టైమింగ్స్ ని పాటించాల్సిందే. లేదంటే ఇలానే జ‌రుగుతుంటుంది.