బన్నీ పుష్ప సినిమా లో విలన్ గా బాలీవుడ్ నటుడు!?
దర్శకుడు సుకుమార్ పుష్ప చిత్రానికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ నేపధ్యంలో సినిమా కు కావల్సిన పనులన్నీ ఇంటి వద్ద నుండే పూర్తి చేస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత నేరుగా సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం ఒక సీరియస్ విలన్ ను వెతికే పనిలో ఉన్నారు. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ నటుడు అయిన సునీల్ శెట్టి ని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ పాత్రకు కు సంబందించిన కథ ని సుకుమార్ వినిపించగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.అంతేకాక తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉన్నందు వలన ఓకే చెప్పారు అని ఫిల్మ్ నగర్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ కూడా ఈ పాత్ర కోసం చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ సినిమా లో విలన్ పాత్రకు ప్రత్యేక శైలి ఉంటుంది. ఇప్పటివరకు ప్రతి సినిమాలో అల్లు అర్జున్ విలన్ పాత్ర రోల్ పై కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. రేసు గుర్రం మొదలు మొన్న వచ్చిన అలా వైకుంఠ పురంలో చిత్రం దాకా ఒక్కొక్క విలన్ ని దింపారు. అయితే పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నారు. లారీ డ్రైవర్ పాత్రలో సీరియస్ గా కనిపించే పాత్రలో అల్లు అర్జున్ ఉండనున్నట్లు తెలుస్తుంది. రశ్మికా కథానాయిక గా ఇప్పటికే సెలక్ట్ అయింది. విజయ్ సేతుపతి ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇక పాన్ ఇండియన్ సినిమా గా తెరకెక్కనుంది ఈ చిత్రం. అందుకోసమే బాలీవుడ్ నటుడు కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నో అంచనాలే నెలకొన్నాయి ఈ చిత్రం మీద. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.